Movie News

Arjun Sarja: నా జీవితంలో విశ్వక్ కి చేసినన్ని ఫోన్లు ఎవరికి చేయలేదు…అర్జున్ కామెంట్స్ వైరల్?

Arjun Sarja: సీనియర్ హీరో అర్జున్ సర్జ దర్శకత్వంలో యంగ్ హీరో విశ్వక్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా అర్జున్ తన కుమార్తెను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి నటుడు విశ్వక్ కి వివరించినప్పటికీ ఆయనకు కథ నచ్చే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమా పూజ కార్యక్రమాలను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని భావిస్తున్న సమయంలో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పకున్నారని వార్తలు రావడంతో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగుకు డేట్ ఫిక్స్ చేసి టెక్నీషియన్లు అందరూ కూడా లొకేషన్ లో ఉన్న సమయంలో విశ్వక్ తనకు ఐ యాం సారీ సార్ షూటింగ్ క్యాన్సిల్ చేయండి అంటూ మెసేజ్ పెట్టారు అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ విధంగా సినిమా అంటే ఏమాత్రం డెడికేషన్ లేకుండా టెక్నీషియన్ లందరూ సినిమా షూటింగుకు రెడీ చేసి ఎదురుచూస్తున్న సమయంలో ఈయన షూటింగ్ క్యాన్సల్ చేయండి అని మెసేజ్ పెట్టడంతోనే ఈయనకు ఏ మాత్రం డేడికేషన్ ఉందో అర్థమవుతుంది.తాను తన 42 సంవత్సరాల సినీ కెరియర్లో ఎప్పుడూ కూడా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఒకరి గురించి చెప్పలేదని ఫస్ట్ టైం ఇలా చెప్పాల్సి వస్తుందని అర్జున్ వెల్లడించారు.

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు రాఘవేంద్ర రావు గారు వంటి వారందరూ హాజరయ్యారు.అదేవిధంగా బాలకృష్ణ గారిని ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానన్నారు అయితే పది రోజుల తర్వాత అని చెప్పగానే తన దర్శక నిర్మాతలను అడిగి చూస్తాను అని నాకు సమాధానం ఇచ్చారు ఇది డెడికేషన్ అంటే.తాను అల్లు అర్జున్ తో సినిమా చేశాను. ఆయన కరెక్ట్ టైం కి లొకేషన్లోకి వస్తారు ఎంతో పరపతి డబ్బు స్టార్ హోదా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ కూడా ఇలా షూటింగ్ క్యాన్సల్ చేయమని చెప్పలేదు అందుకు కారణం ఆయనకు సినిమా పట్ల ఉన్న భక్తి.

Arjun Sarja: నా గౌరవం పై దెబ్బ కొట్టాడు..

ఇకపోతే విశ్వక్సేన్ మాత్రం అరగంట ముందు సినిమా క్యాన్సిల్ చేయండి అంటూ మెసేజ్ పెట్టారని. ఈయన డెడికేషన్ లేని హీరో అంటూ అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితంలో హీరో విశ్వక్ కి చేసినన్ని ఫోన్లు ఎవరికీ చేయలేదని ఈయన మండిపడ్డారు.ఇలా నాకు జరిగిన విధంగా మరి ఇతరులకి జరగకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బయటపెడుతున్నానని అర్జున్ వెల్లడించారు. సామాన్యంగా తన సినిమా నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదని తన కోరుకుంటాను కానీ విశ్వక్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని, ఇలా ఈయన సినిమా నుంచి తప్పుకోవడంతో నా గౌరవం పై దెబ్బ కొట్టినట్లేనని ఈయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా అర్జున్ హీరో విశ్వక్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago