Vishwak Sen: యంగ్ హీరో విశ్వక్ సేన్ సీనియర్ హీరో అర్జున్ కాంబినేషన్లో ఆయన కుమార్తెను హీరోయిన్ గా పరిచయం చేస్తూ ఓ తెలుగు సినిమా చేయాలని భావించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు అర్జున్ నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ఆలస్యం కావడానికి విశ్వక్ కారణమని అర్జున్ వెల్లడించారు.
సినిమా షూటింగ్ ప్రారంభించేముందు ఆయన సినిమా నుంచి తప్పుకున్నారని ఆయన డేడికేషన్ లేని హీరో అంటూ అర్జున్ మీడియా ముందు విశ్వక్ గురించి వెల్లడించారు. ఈయనకి డైలాగ్ రైటర్ బుర్రా సాయి మాధవ్, లిరిసిస్ట్ చంద్రబోస్ తో పడటం లేదని తద్వారా ఈ సినిమా నుంచి తప్పకున్నారని వెల్లడించారు. అయితే నాకు జరిగిన విధంగా మరొక దర్శక నిర్మాతలకు జరగకూడదన్న ఉద్దేశంతోనే ఈయనపై ప్రొడ్యూసర్ గిల్డ్ లో కంప్లైంట్ చేశానని తెలిపారు.
ఈ విధంగా అర్జున్ తన గురించి మీడియా సమావేశంలో మాట్లాడటంతో ఈ విషయంపై హీరో విశ్వక్ స్పందించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను సినిమా కథ విషయంలోనూ,డైలాగ్స్ పాటలు మ్యూజిక్ విషయంలో తాను స్పందించిన విషయం నిజమే అయితే నేను చెప్పిన విధంగా వాళ్లు పాటించలేదు కానీ అర్జున్ తాను చెప్పినట్టే వినాలని మొండిపట్టు పడ్డారు.
ఈ విధంగా నాకు నచ్చని చోట, నాకు గౌరవం లేని చోట పని చేయడం ఇష్టం లేకే తాను ఈ సినిమా నుంచి తప్పుకున్నానని విశ్వక్ అర్జున్ వ్యాఖ్యలకు స్పందించారు.ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ చెక్కులు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తాను నిర్మాతల మండలికి పంపినట్టు విశ్వక్ వెల్లడించారు. మరి ఈ సినిమా విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున వివాదం ఏర్పడిన మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా లేకపోతే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…