Miheeka Bajaj: మిహికా బజాజ్ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.దగ్గుబాటి వారసుడు రానాని ప్రేమించి 2020 వ సంవత్సరంలో ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నటువంటి ఈమె వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నప్పటికీ తన వైవాహిక జీవితం గురించి రోజుకు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రానా మిహిక దంపతులు విడాకులు తీసుకోబోతున్నారు అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు రావడంతో ఈ వార్తల పై స్పందించి పూర్తిగా ఈ వార్తలను కొట్టి పారేశారు. ఇలా విడాకుల గురించి ఈ జంట క్లారిటీ ఇచ్చినప్పటికి తాజాగా మిహికాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈమె తల్లి కాబోతుందని భావించి పెద్ద ఎత్తున రానా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని వార్తలు సృష్టించారు.
ఈ వార్తలపై స్పందించినటువంటి మిహిక ప్రస్తుతం తాను మ్యారీడ్ లైఫ్ లో ఎంతో సంతోషంగా ఉన్నానని తద్వారా కొద్దిగా హెల్దిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా ఓ చిన్నారిని ఎత్తుకొని నా ఏంజెల్ తో మొదటి ఫోటో ప్రేమతో మిహికా బజాజ్ అంటూ క్యాప్షన్ జోడించారు ఈ క్రమంలోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నయనతార విగ్నేష్ దంపతుల మాదిరిగానే ఈ దంపతులు కూడా సరోగసి విధానం ద్వారా బిడ్డకు జన్మనిచ్చారా అంటూ పెద్ద ఎత్తున వార్తలు రావడమే కాకుండా వీరికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇలా మిహికా షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్ కావడంతో చాలామంది రానా దంపతులు తల్లిదండ్రులయ్యారని భావించారు. అయితే ఈ వార్తలపై స్పందించిన మిహిక తను తన పాప కాదని తన మేనకోడలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా మీరందరూ శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ ఈమె క్లారిటీ ఇచ్చారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…