Actress Tabu: తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి టబు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. ఒకానొక సమయంలో తెలుగుతోపాటు తమిళ సినిమాలలో అగ్ర హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీకి దూరమైన బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ విధంగా ఐదు పదుల వయసులో ఉన్నటువంటి ఈమె ఇప్పటికివివాహం చేసుకోకుండా ఒంటరిగా జీవితాన్ని గడుపుతూనే వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే నటి టబు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మొదటిసారి తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.టబూ తన సోదరి జన్మించిన తర్వాత కొన్ని కారణాలవల్ల తన తండ్రి తన తల్లికి విడాకులు ఇచ్చారని, వీరి బాగోగులన్నీ కూడా తన తల్లి చూసుకున్నారని ఈమె వెల్లడించారు.
ఈ విధంగా చిన్నప్పటి నుంచి తాను ఒంటరిగానే పెరిగానని, తన తండ్రి ప్రేమకు తాను నోచుకోలేదు అందుకే ఆయన జ్ఞాపకాలు నాకు లేవు అంటూ ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు. ఇక ఆయన లేకపోయినా ఆయన ఇంటిపేరు మాత్రమే ఉందని ఈమె వెల్లడించారు. ఇకపోతే తన జీవితంలో ఎప్పుడూ కూడా తన తండ్రిని కలవలేదని ఈమె తెలిపారు.
ఇక తన సోదరి మాత్రం కొన్ని సందర్భాలలో తన తండ్రిని కలుస్తూ ఉన్నప్పటికీ తాను మాత్రం చిన్నప్పటినుంచి తాను పెరిగిన జీవితంలోనే ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఈ సందర్భంగా టబు మొదటిసారి తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.ఇక ప్రస్తుతం ఈమె వరస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ తెలుగులో కూడా అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…