Bhagya Shree: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న భాగ్యశ్రీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన యువరత్న రాణా సినిమాలో ఈమె బాలకృష్ణకు చెల్లెలి పాత్రలో నటించి సందడి చేశారు. ఇలా చాలా కాలం తర్వాత తిరిగి ఈమె ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించారు.
ఈ విధంగా చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె తిరిగి మరోసారి తన నటనతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈమె హాస్పిటల్లో తన భర్తతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈమె తన భర్తకు సర్జరీ జరిగిందనే విషయాన్ని ఈమె తెలియజేశారు.
భాగ్యశ్రీ తన భర్త హిమాయ్ దాసాని హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు. మనం భుజంలో ఉన్న రొటేటర్ కఫ్ సాయంతో 360 డిగ్రీలలో కోణంలో తిప్పగలం. అయితే తన భర్తకు ఆ రొటేటర్ కఫ్ సర్జరీ నిర్వహించినట్టు ఈమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.సుమారు నాలుగు గంటల పాటు వైద్యులు ఆయనకు సర్జరీ నిర్వహించారని ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటూ ఈమె తన భర్తతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…