Tollywood Actress: సినిమా ఇండస్ట్రీలో నటీమణులుగా కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనంతరం ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీకి చెందిన వారిని పెళ్లి చేసుకొని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండగా మరికొందరు మాత్రం ప్రముఖ వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలో సెటిల్ అయిన వారు ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కొంతమంది నటీమణులు వ్యాపారవేత్తలతో ఏడడుగులు నడిచారు. మరి బిజినెస్ మేన్ లని పెళ్లి చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఎవరు అనే విషయానికి వస్తే…
శిల్పా శెట్టి: తెలుగు హిందీ భాషలలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శిల్పా శెట్టి రాజ్ కుంద్రా అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా ఈమె పెళ్లి చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నారు.
ఆసిన్: గజిని సినిమాతో తెలుగు ప్రేక్షకులను సందడి చేస్తున్న ఆసిన్ అనంతరం పలు తెలుగు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. అయితే ఈమె మైక్రోమ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మను వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ప్రియమణి: పెళ్లయిన కొత్తలో, రగడ, యమదొంగ వంటి పలు సినిమాలలో నటిస్తున్న ప్రియమణి ఈవెంట్ ఆర్గనైజింగ్ బిజినెస్ చేసే ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఆయనకు ఇది రెండవ వివాహం.
పూర్ణ: అవును సీమటపాకాయ్ వంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈమె దుబాయ్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.
కాజల్: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను సొంతం చేసుకుని ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇక ఈయన కాజల్ స్నేహితుడు కావడం విశేషం.
హన్సిక: దేశముదురు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హన్సిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఈమె ముంబై కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సోహైల్ కతురియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే ఈయనకు కూడా ఇది రెండవ వివాహం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…