Samantha: టాలీవుడ్ నటి సమంత ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఈమె అనారోగ్య సమస్యతో బాధపడటం వల్ల ప్రస్తుతం చికిత్స తీసుకుంటూ తాను కమిట్ అయిన సినిమాలకు కొన్ని రోజులపాటు విరామం ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని తెలుస్తోంది.
ఈమె కనీసం నిలబడలేని నడవలేని స్థితిలో ఉండి పూర్తిగా బెడ్ కి మాత్రమే పరిమితమయ్యారని తెలుస్తుంది.ఇక సమంత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనడానికి కారణం ఆమె కమిట్ అయిన సినిమా షూటింగులు వాయిదా పడటమే అందుకు సాక్ష్యం అని చెప్పవచ్చు. నవంబర్ 11వ తేదీ విడుదల కాబోతున్న యశోద సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సమంత దూరమయ్యారు.
అదేవిధంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఈమె నటిస్తున్న ఖుషి సినిమా డిసెంబర్లోనే విడుదల చేయాలని ముందుగా ప్రకటించినప్పటికీ సమంత అనారోగ్య సమస్య కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలని మైత్రి మూవీస్ భావించారు.
ఈ విధంగా సమంత అనారోగ్య సమస్య కారణంగానే తాను కమిట్ అయిన సినిమాలు మరి కాస్త ఆలస్యం అవుతున్నాయని ఈమె కొద్ది రోజులపాటు చికిత్స తీసుకున్న అనంతరం విశ్రాంతి కూడా తప్పనిసరి కావడంతో ఈ సినిమాలన్నీ కూడా వాయిదా పడుతున్నట్లు తెలుస్తోంది. లైగర్ వంటి డిజాస్టర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో హిట్ కొట్టాలని భావించారు. సమంత కారణంగా ఈ సినిమా ఆలస్యం కానుందని తెలియడంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా పనులలో బిజీ అవుతున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…