Viswak Sen TV 9 Devi controversy : చిన్నగా కెరీర్ మొదలుపెట్టి ఇపుడు ఓ మోస్తారు గుర్తింవు ఉన్నా హీరోగా మారాడు విశ్వక్ సేన్. ఫలక్ నుమా దాస్ వంటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్. ఆ తరువాత హిట్ పాగల్ వంటి విభిన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆకట్టుకున్నాడు. తాజాగా విశ్వక్ సేన్ నటించిన అశోక వనములో అర్జున కళ్యాణం సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇక విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ నుండి tv9 స్టూడియో వరకు వివాదం ముదిరి పాకాన పడింది.
గెట్ అవుట్ అన్న దేవి నాగవల్లి….
ఫిలింనగర్‌లోని రోడ్డులో ఓ అభిమాని చేత సూసైడ్ చేసుకోబోతున్నట్టుగా వీడియో చేయించి రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ ప్రాంక్ వీడియోపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనాలు. అయితే ఒక అడ్వకేట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని మానవహక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసారు ఇలా ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతుంటే టీవీ ఛానెల్స్ ఆగుతాయా మరీ ముఖ్యంగా టీవీ 9 ఆగుతుందా ఇక స్టూడియోకి విశ్వక్ సేన్ ను డిబేట్ కి ఆహ్వానించింది.
ఇక దేవి నాగవల్లి విశ్వక్ మరియు సినిమా ప్రముఖుడు త్రిపురనేని చిట్టి తో డిబేట్ నిర్వహించారు.దీనిలో భాగంగా విశ్వక్‌సేన్, యాంకర్ దేవి నాగవల్లి మధ్య వివాదం చోటు చేసుకోవడం.. ఈ క్రమంలో దేవి నాగవల్లి.. విశ్వక్‌సేన్‌ని గెట్ ఔట్ అనడం,దాంతో విశ్వక్ సేన్ స్టూడియోలో ఎఫ్ పదం తో వచ్చే బూతులతో మాట్లాడటం జరిగింది. వీరిద్దమరి మధ్య చోటు చేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది .
ఈ క్రమంలో ఈ సంఘటనపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. విశ్వక్‌సేన్‌కు మద్దతివ్వడమే కాక దేవి నాగవల్లిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చిన్న హీరో కాబట్టి విశ్వక్ ను గెట్ అవుట్ అనగలిగావని పెద్ద హీరో అయితే ఎలా మాట్లాడే దానివా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మరికొంత మంది మొదట నువ్వు పాగల్ శీను, డిప్రెషన్ పర్సన్ అని అనడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఏకిపారేస్తున్నారు. అసలు మీది టీవీ స్టూడియోనా, నీది అసలు జర్నలిజమేన అంటూ దేవిని తెగ ట్రోల్ చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…