Featured

Vishwak Sen vs Devi Nagavalli : విశ్వక్ సేన్ ను చెప్పుతో కొట్టాల్సింది.. దానం నాగేందర్ షాకింగ్ కామెంట్స్..!

Vishwak Sen vs Devi Nagavalli : ఒక విషయం చిరిగి చాట అంత అయి చాపంత అవడం ఈ సోషల్ మీడియా జమానాలో మాములే. ప్రాంక్ తో అందరి నోట్లో నానుతున్న విశ్వక్ సేన్ మళ్ళీ టీవీ 9చేతిలో పది ఇంకొంచం నలిగిపోయాడు. ఇప్పటికే అభిమాని సుసైడ్ ప్రాంక్ వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. ఓ వైపు మానవ హక్కుల కమిషన్ కూడా విషయంలో గుర్రుగా ఉంది. ఏకంగా అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసారు.

ఇక ఇలాంటి వివాదాలను అస్సలు వదలని టీవీ 9 ఏకంగా డిబేట్ పెట్టింది ఇక ఈ డిబేట్ లో దేవి నాగవల్లి విశ్వక్ సేన్ గురించి పాగల్ శీను , డిప్రెషన్ పర్సన్ అని అనడంతో వివాదం మొదలైంది. ఇక దేవి నాగవల్లి గెట్ అవుట్ అంటూ విశ్వక్ సేన్ ని అనడంతో విశ్వక్ కూడా అనుచిత వాఖ్యలు దేవి పై చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇక నెటిజన్లు చాలా మంది విశ్వక్ కు మద్దతుగా నిలిచి జర్నలిజం వచ్చా అంటూ దేవి నాగవల్లిని ట్రోల్ చేసారు. ఇక ఇపుడు ఈ వివాదం ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లి మరో మలుపు తిరిగింది.

అక్కడే చెప్పుతో కొట్టాల్సింది…..

ఇక టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీన్ లోకి వచ్చారు. రోడ్లపై ఇలాంటి వ్యవహారాలు చేయడమే తప్పు. ఆయన క్షమాపణ చెప్పినా మేం అంగీకరించం. అతడు వేదిక మీద ఎఫ్‌ పదం వాడగానే దేవి నాగవల్లి చెప్పుతో కొట్టాల్సింది. అతడిపై పోలీసులు సుమోటోగా కేసు ఫైల్‌ చేయాలి. దెబ్బ తగిలితే,అమ్మా అన్నట్లు ఆ పదం వాడిన అంటున్నాడు. అదే సమయంలో విశ్వక్‌ సేన్ పక్కన అతడి తల్లి, చెల్లి ఉంటే ఇలానే మాట్లాడతాడా, సారీ చెప్తే సరిపోదు, దేవి నాగవల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్‌ అయితే బట్టలిప్పదీసి పరిగెత్తించి కొడతామని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హెచ్చరించారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago