Featured

Viswak Sen Vs Devi Nagavalli : విశ్వక్ సేన్ వ్యక్తిగతంగా దూషించాడంటూ మంత్రికి పిర్యాదు చేసిన దేవి నాగవల్లి..! చర్యలు తీసుకుంటామన్న మంత్రి తలసాని..

విశ్వక్ సేన్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు గల కారణం ఆయన చేసిన ఫ్రాంక్ వీడియో అని అందరికీ తెలిసిందే. చిన్న విషయం చిరిగి చాట అంత అయి చాపంత అవడం ఇదేనేమో.. అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..

ఇక ఇలాంటి వివాదాలను ఏమాత్రం వదలని టీవీ9 చానల్ ఏకంగా డిబేట్ పెట్టేసారు. ఈ నేపధ్యంలో యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ పాగల్ శీను, డిప్రెషన్ పర్సన్ అంటూ అనడంతో వివాదం మరో లెవల్ కి వెళ్ళిపోయింది.. ఇక దేవి నాగవల్లి గెట్ అవుట్ అనడం.. హీరో విశ్వక్ సేన్ కూడా “F” వర్డ్ యూజ్ చేస్తూ అనుచిత వాఖ్యలు చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. అయితే జరిగిన మొత్తం ఎపిసోడ్ లో నెటిజన్లు చాలా మంది విశ్వక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు యాంకర్ దేవి నాగవల్లిపై తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక ఇపుడు ఈ వివాదం మంత్రి వరకు వెళ్లి మరో మలుపు తిరిగింది.

ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటాం..

హీరో విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవాలంటూ టీవీ9 టీం, జర్నలిస్ట్ సంఘాలతో కలిసి యాంకర్ దేవి నాగవల్లి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి పిర్యాదు చేసాయి. హీరో విశ్వక్ సేన్ వ్యక్తిగతంగా పరుష పదజాలంతో దూషించాడని అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పిర్యాదు చేసారు యాంకర్ దేవి నాగవల్లి. ఈ పిర్యాదుపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపధ్యంలో తలసాని మాట్లాడుతూ చిత్రం ప్రమోషన్స్ చేయాలనుకుంటే కొన్ని పర్మిషన్స్ తీసుకుని చేయాలి అది మానేసి రోడ్డు మీద అందరినీ డిస్టర్బ్ చేయడం అనేది సరైన పద్దతి కాదు దీనిపై ఇప్పటికే పోలీసు అధికారులతో మాట్లాడాను అని తెలిపారు మంత్రి తలసాని.

టీవీ 9 డిబెట్ గురించి మాట్లాడుతూ ఆ డిబేట్ చూశానని అందులో అతని బిహేవియర్ బాలేదని దీనిపై ప్రభుత్వం సీరియస్ గాతీసుకుంటుందని తెలిపారు తలాసాని. యాంకర్ కొన్ని పాయింట్స్ డిబేట్ లో మాట్లాడేటప్పుడు అతను మరో రకంగా సమాధానం చెప్పడం సభ్యసమాజంలో ఇది కరెక్ట్ కాదని, ముఖ్యంగా ఒక ఆడకూతురిని ఈ విధంమైన పదజాలంతో కించపరచడం అనేది కరెక్ట్ కాదని స్పష్టం చేసారు మంత్రి తలసాని. దీనిపై ఫిలిం డవలప్మెంట్ కార్పోరేషన్ నుంచి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago