Vishwak Sen vs Devi Nagavalli : ఒక విషయం చిరిగి చాట అంత అయి చాపంత అవడం ఈ సోషల్ మీడియా జమానాలో మాములే. ప్రాంక్ తో అందరి నోట్లో నానుతున్న విశ్వక్ సేన్ మళ్ళీ టీవీ 9చేతిలో పది ఇంకొంచం నలిగిపోయాడు. ఇప్పటికే అభిమాని సుసైడ్ ప్రాంక్ వల్ల నెగెటివిటీ మూటగట్టుకున్నాడు. ఓ వైపు మానవ హక్కుల కమిషన్ కూడా విషయంలో గుర్రుగా ఉంది. ఏకంగా అరుణ్ కుమార్ అనే అడ్వకేట్ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేసారు.

ఇక ఇలాంటి వివాదాలను అస్సలు వదలని టీవీ 9 ఏకంగా డిబేట్ పెట్టింది ఇక ఈ డిబేట్ లో దేవి నాగవల్లి విశ్వక్ సేన్ గురించి పాగల్ శీను , డిప్రెషన్ పర్సన్ అని అనడంతో వివాదం మొదలైంది. ఇక దేవి నాగవల్లి గెట్ అవుట్ అంటూ విశ్వక్ సేన్ ని అనడంతో విశ్వక్ కూడా అనుచిత వాఖ్యలు దేవి పై చేయడంతో వివాదం మరో మలుపు తిరిగింది. ఇక నెటిజన్లు చాలా మంది విశ్వక్ కు మద్దతుగా నిలిచి జర్నలిజం వచ్చా అంటూ దేవి నాగవల్లిని ట్రోల్ చేసారు. ఇక ఇపుడు ఈ వివాదం ప్రభుత్వ పెద్దల వరకు వెళ్లి మరో మలుపు తిరిగింది.
అక్కడే చెప్పుతో కొట్టాల్సింది…..
ఇక టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీన్ లోకి వచ్చారు. రోడ్లపై ఇలాంటి వ్యవహారాలు చేయడమే తప్పు. ఆయన క్షమాపణ చెప్పినా మేం అంగీకరించం. అతడు వేదిక మీద ఎఫ్ పదం వాడగానే దేవి నాగవల్లి చెప్పుతో కొట్టాల్సింది. అతడిపై పోలీసులు సుమోటోగా కేసు ఫైల్ చేయాలి. దెబ్బ తగిలితే,అమ్మా అన్నట్లు ఆ పదం వాడిన అంటున్నాడు. అదే సమయంలో విశ్వక్ సేన్ పక్కన అతడి తల్లి, చెల్లి ఉంటే ఇలానే మాట్లాడతాడా, సారీ చెప్తే సరిపోదు, దేవి నాగవల్లి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే బట్టలిప్పదీసి పరిగెత్తించి కొడతామని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు.
































