Featured

VJ Sunny : బిగ్ బాస్ వెళ్లిన వారికి ఇండస్ట్రీ లో ఆఫర్స్ ఇవ్వడం లేదా?? షాకింగ్ కామెంట చేసిన వీజే సన్నీ..!

VJ Sunny : బిగ్ బాస్ రియాలిటీ షోలో కనపడితే చాలు కావాల్సినంత ఫేమ్ వస్తుంది, ఆడియన్స్ కి దగ్గరవుతాము అనే భావనలో చాలా మంది ఉంటారు. కానీ రియాలిటీ అందుకు భిన్నగా ఉంటోంది. బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచిన వాళ్ళే ఇండస్ట్రీలో, సినిమాల్లో వదిలిపెడితే బుల్లి తెర మీద కూడా పెద్దగా అవకాశాల్లేక ఖాళీగా ఉన్నారు. ఇక మరికొందరు అసలు ఎక్కడున్నారో కూడా ఆడియన్స్ కి తెలియదు. బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా పరిస్థితి చూస్తే బిగ్ బాస్ లో ఉన్నపుడు ఆర్మీ అంటూ అభమానులు తెగ హడావిడి చేసారు, అసలు బయటికి వచ్చాక క్రేజ్ మామూలుగా ఉండదు అన్నట్లుగా అందరికీ అనిపించినా టీవీ షోలలో అడపాదడపా కనిపించడం తప్పితే కౌశల్ పెద్దగా కెరీర్ లో సక్సెస్ అయింది లేదు. ఇక అభిజిత్, శివ బాలాజీ, వీళ్ళ పరిస్థితీ అంతే. ఇక శివ బాలాజీ ముందు నుండి సినిమాల్లో కాస్త ఉన్నాడు కాబట్టి అలానే నేట్టుకొస్తున్నాడు కానీ పెద్దగా బిగ్ బాస్ నుండి ఒరిగిందేమీ కనిపించడంలేదు.

మన కెరీర్ మనమే నిర్మించుకోవాలి…

ఇక బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా నిలిచిన విజే సన్నీ ప్రస్తుతం బుల్లి తెర మీద కనిపించక పోయినా హీరోగా ‘సకల గుణాభి రామ’ అనే సినిమాతో రానున్నాడు. అయితే ఈ సినిమా బిగ్ బాస్ కి వెళ్ళక ముందే చేసినది కాకపోతే బిగ్ బాస్ వల్ల మంచి ఫేమ్ సంపాదించుకున్న సన్నీ ఆ క్రేజ్ ని ఈ సినిమా కు ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటున్న సన్నీ బిగ్ బాస్ వాళ్ళను ఇండస్ట్రీ పట్టించుకోవడం లేదు తీసుకోరు అనే టాక్ పైన స్పందించాడు.

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక ఆఫర్స్ ఉండటం లేదు, ఇండస్ట్రీ లో బిగ్ బాస్ నుండి వచ్చిన వాళ్లను తీసుకోవడం లేదు అన్నది అవాస్తవం అంటూ కొట్టిపడేసాడు. నీ కెరీర్ ఎలా నిర్మించుకోవాలన్నది నీ ఇష్టం, అది నీ నిర్ణయాలను బట్టి ఉంటుంది అంతే దానికి బిగ్ బాస్ కారణం కాదు అంటూ అన్నారు. అవకాశాలకోసం ప్రయత్తినిస్తూనే ఉండాలి, కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా వస్తుంది అంటూ సన్నీ చెప్పాడు.

Bhargavi

Recent Posts

గుడిలో చెప్పులు పోతే మంచిదేనా? పెద్దలు చెప్పిన నమ్మకాల వెనుక నిజం ఇదే

గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…

7 minutes ago

250 ఏళ్ల తర్వాత మళ్లీ కేరళ కుంభమేళా.. ‘మహా మాగం’కు వేలాదిమంది భక్తులు!

దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…

15 minutes ago

తిరుమల శ్రీవారి సేవకు.. కృష్ణయ్య, పురాణపండలకు ఎన్ని జన్మల పుణ్యమిది..

హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…

12 hours ago

మార్చి 3 చంద్రగ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులే!

2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…

15 hours ago

మేడి పండులో నిజంగానే పురుగులుంటాయా? అసలు నిజం ఇదే!

“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…

15 hours ago

వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ? క్లారిటీ ఇచ్చిన కవిత:

తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…

15 hours ago