Chiranjeevi: ఏపీలో మరొక ఐదు రోజులలో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ క్రమంలోనే ఉత్కంఠత నెలకొంది ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పై అందరి ఆసక్తి ఉంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఆయన గెలుపు కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున సినిమా సెలబ్రిటీలు అందరూ కూడా పిఠాపురంలో పర్యటనలు చేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం పిఠాపురం వచ్చి ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటారని వార్తలు వచ్చాయి కానీ చిరంజీవి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. కానీ ఆయన మాత్రం తన తమ్ముడికి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తూనే వచ్చారు. ఇకపోతే ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ను గెలిపించాలి అంటూ చిరంజీవి షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అమ్మ కడుపున ఆఖరి పుట్టిన వాడైన జనం కోసం ముందు నిలబడ్డారు. అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎంతోమంది కౌలు రైతులకు కన్నీటిని తుడిచారు. సరిహద్దులలో ఉన్నటువంటి జవాన్లకు సహాయం చేశారు అధికారం లేకపోయినా ఇంత చేశారు అంటే అధికారంలోకి వస్తే ఇంకెంత మంచి చేస్తారని ప్రశ్నించారు.
చట్టసభలలో గొంతు వినిపించాలి..
తాను బలంగా నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలలో గొంతు వినిపించాలంటే పిఠాపురం సభ్యులందరూ ఆయనని గెలిపించాలని కోరుతూ వీడియో చేశారు పవన్ కళ్యాణ్ సినిమాలలోకి చాలా అయిష్టంతో వచ్చారు. కానీ రాజకీయాలలోకి చాలా ఇష్టంగా వచ్చారని ప్రజలందరూ ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరుతూ చిరంజీవి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…