ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం స్పష్టించిన కేసులో అత్యాచార నిందితుడు కార్పొరేటర్ భర్త ఆకుతోట శిరీశ్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. దీనిలో శిరీష్ తో పాటు అతడి తండ్రి సుధాకర్‌ను కూడా మిల్స్ కాలనీ పోలీసులు అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. 2017లో శీరీష్ మరియు బాధిత మహిళ ప్రేమించుకున్నారు.
వివాహం చేసుకుంటానని ఆమె వెంట పడి నమ్మించాడు. అలా వాళ్లు కలిసి ఉన్న సమయంలోనే ఆమె కుటుంబ సభ్యుల పేరిట గల భూమిని విక్రయించగా.. వచ్చిన డబ్బు నుంచి 90లక్షల రూపాయలు శిరీష్ ఖాతాల్లో జమచేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకుంటాడనే నమ్మకంతో పెద్దమొత్తంలో డబ్బును శిరీష్ ఖాతాల్లో వేసినట్టు లావాదేవీల ఆధారాలతో పోలీసులకు వివరించింది.
అయితే శిరీష్ మరో యువతిని పెళ్లి చేసుకుని తనను మోసం చేయడమే కాకుండా…. తన డబ్బులు తిరిగివ్వకుండా తండ్రి సుధాకర్‌తో కలిసి బెదిరింపులకు దిగాడని ఆమె తెలిపారు. అందులో భాగంగానే ఇంటికి పిలిచి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై గత నెల 23 న సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటినుంచి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న వాళ్లను ఎట్టకేలకు నేడు పట్టుకొని అరెస్టు చేశారు.
అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ భర్త కావడం తండ్రి లిక్కర్ వ్యాపారి కావడంతో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు బాధిత యువతితో కూడా రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఫలించకపోవడంతో పోలీసులు కచ్చితంగా అతడిని అరెస్టు చేయాల్సి వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే ఇంత సమయం కూడా తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పరకాల జైలుకు పంపినట్లు ప్రాథమింగా సమాచారం అందుతోంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ భర్త శిరీశ్ పై నమ్మకద్రోహం, మోసం, బెదిరింపు, అత్యాచారం తదితర కేసులను పలు సెక్షన్ల కింద నమెదు చేసి అరెస్టు చేశారు.
ఈ దేశంలో అన్ని భాషల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నో పీఠాలు, మఠాలు, దేవస్థానాలు, ధార్మిక మండళ్ళూ, ట్రస్ట్ లు, ధార్మిక…
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…