ప్రస్తుతం డబ్బులు తీసుకోవాలన్నా.. డబ్బు డిపాజిట్ చేయాలన్నా.. బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా అయింది. ఎందుకంటే.. అంతా డిజిటల్ మయం కాబట్టి. ఆన్ లైన్ లోనే అన్ని జరిగిపోతున్నాయి. అయితే ఆన్‌లైన్ లో అనుకోకుండా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు భారీ నష్టాన్ని తీసుకురావచ్చు. అందులో ముఖ్యమైనది అమౌంట్ ట్రాన్సఫర్.
ఆన్లైన్లో బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బును వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒకటికి రెండు సార్లు… అకౌంట్ నంబర్ లేదా.. ఫోన్ నంబర్ ను సరిచూసుకోవాలి. లేదంటే, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో మనం చేసే చిన్న తప్పు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. కానీ, అమౌంట్ ట్రాన్స్ ఫర్ సమయంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకు సంబంధించి బ్యాంక్ ను సంప్రదించి సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
మొదట నేరుగా మీ బ్యాంక్ కు వెళ్లి.. మీ వివరాలను బ్రాంచ్ మేనేజర్ కు అందించాలి. ఆ తర్వాత బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మీకు జరిగిన నష్టాన్ని గురించి అడిగి తెలుసుకుంటారు. ఏం జరిగిందో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. అతడు దానిని ఎలా రికవరీ చేయాలనే వివరాలను వివరంగా చెబుతారు. తర్వాత ప్రతీ దినం కస్టమర్ కేర్ సెంటర్ కి కాల్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది.
ఇలా రెండు మూడు రోజుల సమయం తర్వాత మనం తప్పుగా ఎంటర్ చేసిన అకౌంట్ నుంచి డబ్బులను మన అకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేస్తారు. పొరపాటున వేరే అకౌంట్‌కు పంపిన మీ డబ్బును తిరిగి పొందేందుకు పై మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. అలాంటి రిస్క్ రాకుండా ఉండాలంటే.. ఐఎఫ్ఎస్సీ కోడ్ ను కూడా జాగ్రత్తగా సరి చూసుకోవాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…