మెగా స్టార్ చిరంజీవి నంటించిన ‘స్టాలిన్’ సినిమాలో హీరోకి అక్క పాత్రలో నటించిన ఖుష్బూ.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. తమిళంలో ఎక్కువగా సినిమాల్లో నటించిన ఆమె నటనకు అభిమానుల గుడి కూడా కట్టించారు.
అంతలా ఆమెకు అభిమానులు నీరాజనాలు పలికారు. అప్పట్లోనే ఆమె అందచందాలతో కుర్రకారు గుండెల్లో ఒక మరిచిపోలేని తీపి గుర్తుగా నిలిచిపోయారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. తల్లి, అక్క పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఖుష్బూ గురించి చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే.. 50 ఏళ్ల వయస్సులో కూడా ఆమె 25 ఏళ్ల నటిగా ఉన్నప్పుడు ఉన్న అందచందాలతో కనిపించారు.
స్లిమ్ గా తయారయ్యి తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఖుష్బూ లేట్ వయసులో ఇంతటి ఘాటుగా పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న అటువంటి ఆడాళ్ళు మీకు జోహార్లు చిత్రంలో నటిస్తుంది.
అందులో శర్వానంద్, రష్మిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతే కాకుండా.. ఆమె తమిళంలోని పలు టీవీ షోలో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఆమె పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రతీ ఒక్కరు ఆమె 25 ఏళ్ల వయస్సులో నటించిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళంలో ఆమె రజనీకాంత్ తో ఓ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…