Bindu Madhavi: ఆవకాయ బిర్యానీ హీరోయిన్ గా అందరికీ సుపరిచితమైన బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాలు వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన ఈమె ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇలా 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది.
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో టాస్క్ లు ఉండడం సర్వసాధారణం. ఇలా బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లో భాగంగా ప్రతి ఒక్కరు వారి వ్యక్తిగత విషయాల గురించి తెలియజేయాలని సూచించారు ఈ క్రమంలోనే బిందుమాధవి తన జీవితంలో లవ్ బ్రేకప్ గురించి తెలియజేశారు.
తను కాలేజీలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాననే విషయం ఈ సందర్భంగా బయట పెట్టారు.అయితే అతను చదువుపై ఆసక్తితో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిపోయారని తాను నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చానని బిందుమాధవి తెలిపారు.
ఇలా మొదటి సారి అతనితో లవ్ లో ఉన్న రిలేషన్ తనకు ఎంతో ప్రత్యేకమని ఈ సందర్భంగా బిందుమాధవి వెల్లడించారు. అయితే తన లవ్ బ్రేకప్ గురించి బయటపెట్టిన ఈమె అతని పేరు మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం అతనికి పెళ్లి కూడా అయిపోయిందని ఈ సందర్భంగా గురించి చెప్పుకొచ్చారు. అయితే తనతో బ్రేకప్ అయిన తర్వాత తను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లి పోయానని అదే సమయంలో తమిళ్ బిగ్ బాస్ అవకాశం రావడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొద్దిరోజుల్లోనే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని తెలిపారు. ఇలా ప్రస్తుతం తెలుగులో కూడా ఈ అవకాశం రావడంతో ఇక్కడ కూడా బిందుమాధవి పాల్గొని ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…