Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఎంతో మంచి హృదయం కలవాడని నిరూపించుకున్నారు. మహేష్ బాబు ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయిస్తున్న విషయాన్ని తాజాగా బాలయ్య టాక్ షో ద్వారా బయట పెట్టారు.
మహేష్ బాబు కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉన్నారని ఆరు వారాల ముందు పుట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అయితే మాకు డబ్బు ఉంది మేం బతికించుకున్నాం.. డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి అని ఆలోచన వచ్చిందని అప్పటి నుంచి చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించడం మొదలు పెట్టామని తెలిపారు.
ఇప్పటివరకు మహేష్ బాబు ఏకంగా వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకు ఆపరేషన్ చేయించారు. ఈ క్రమంలోనే శామ్యూల్ అమ్మాజీ అనే దంపతులకు జన్మించిన అంకిత్ భార్గవ్ కూడా చిన్నప్పుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడ్డారని మూడు వారాలలో ఆపరేషన్ చేయకపోతే చనిపోతారని డాక్టర్లు తెలిపినట్లు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.
తమ బాబుకి ఐదు నెలల వయసులోనే గుండెలో సమస్య ఏర్పడిందని ఆపరేషన్ చేయించాలి అంటే అధిక మొత్తంలో డబ్బు అవసరం అవుతుందని డాక్టర్లు తెలిపారు అలాంటి సమయంలో మహేష్ బాబు అభిమానుల ద్వారా ఈ విషయాన్ని మహేష్ బాబు పిఏ వరుకు ఈ విషయాన్ని చేర్చామని ఆ తర్వాత మహేష్ బాబు పిఏ హాస్పిటల్ నుంచి ఫోన్ చేయించి బాబుకు ఆపరేషన్ చేయిస్తామని చెప్పినట్లు ఈ దంపతులు వెల్లడించారు.ఇలా తమ కొడుకుకి మరో జన్మ ఇచ్చిన దేవుడు మహేష్ బాబు అని అతనిని మరోసారి జీవితంలో చూస్తామని ఎప్పుడూ అనుకోలేదని ఈ దంపతులు తెలిపారు.ఒక్కసారిగా మహేష్ బాబుని చూడగానే కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆయన కాళ్ళకు నమస్కరించినట్లు వెల్లడించారు. మహేష్ బాబుని కలిసిన తర్వాత ఆయన బాబుకి ఎలా ఉంది ఇప్పుడు మీరు హ్యాపీ కదా అని అడిగారని ఈ ఇంటర్వ్యూలో ఈ దంపతులు తెలిపారు. నిజంగా దేవుడు మనిషి రూపంలో ఉంటాడు అనడానికి మహేష్ బాబు నిదర్శనమని ఆయన రూపంలో ఆ బిడ్డను కాపాడారనీ ఈ దంపతులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…