Mohan Babu: మోహన్ బాబు డైరెక్టర్ డైమండ్ రత్నంబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సన్ ఆఫ్ ఇండియా.ఇప్పటివరకు సొసైటీలో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్న విధంగా ప్రైవేటు జైలు ఉంటే ఎలా ఉంటుందని ఒక కొత్త ఆలోచనతో ఒక ప్రయోగాత్మక చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా థియేటర్ కి కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు అయితే కథ నేపథ్యం ఎంతో అద్భుతంగా ఉండటం చేత ఈ సినిమాని మోహన్ బాబుగారు థియేటర్ లోనే విడుదల చేయాలని పట్టుబడ్డాడని ఇంటర్వ్యూలో డైరెక్టర్ రత్నం బాబు వెల్లడించారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ముందుగా ఓటీటీలో విడుదల చేయాలని భావించి ఈ సినిమాలో యూత్ ను ఆకట్టుకునే విధంగా కొన్ని ముద్దు సన్నివేశాలను పెట్టాము.ఇలా ఈ సినిమా మొత్తాన్ని తెరకెక్కించాక ఈ సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత ఇది ఓటీటీలో విడుదల కావలసిన సినిమా కాదని తప్పకుండా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని భావించారు.
ఈక్రమంలోనే ఈ సినిమా థియేటర్లో విడుదల చేయాలని భావించినప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో విష్ణు ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు అన్నింటిని కట్ చేసి సెన్సార్ టీమ్ కి పని లేకుండా చేశారని ఈయన తెలియజేశారు. ఇలా ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలను తొలగించినా ఒక సన్నివేశంలో మాత్రం అలాగే ఉంచామని రత్నం బాబు తెలిపారు. ఇలా ముద్దు సన్నివేశాలు పెట్టడంతో విష్ణు మనకు సొసైటీలో విద్యాసంస్థలను నడుపుతూ మంచి పేరు ఉంది ఇలాంటి సన్నివేశాలు ఉండకూడదని ఆ సన్నివేశాలు కట్ చేసినట్టు డైరెక్టర్ తెలియ చేశారు. కానీ ఓటీటీలో ఆ సన్నివేశాలతో విడుదల చేస్తామని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…