సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు సోషల్ మీడియాలో తరచూ చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొంతకాలంగా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రేమ వివాహాలు చేసుకున్నా, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నా కొంతమంది సెలబ్రిటీ జంటలు కలిసి కొనసాగలేకపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో ప్రముఖ హీరోయిన్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో జరుగుతున్న తాజా చర్చ ప్రకారం, ప్రముఖ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. భర్తతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను తొలగించడం, అలాగే ఆయనను అన్‌ఫాలో చేయడం వంటి చర్యలు తీసుకోవడంతో విడాకుల ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. దీంతో ఆమె వ్యక్తిగత జీవితంపై రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ హీరోయిన్ మరెవరో కాదు, టెలివిజన్ రంగంలో ‘నాగిని’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి మౌనీ రాయ్. బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించిన ఆమె, ప్రస్తుతం సినిమా అవకాశాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో కూడా ఆమె ఓ ప్రత్యేక పాటలో కనిపించనున్నట్లు సమాచారం.
మౌనీ రాయ్ 2022 జనవరిలో దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను వివాహం చేసుకున్నారు. గోవాలో జరిగిన ఆ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మలయాళీ, బెంగాలీ సంప్రదాయాల మేళవింపుతో జరిగిన ఆ పెళ్లి అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది.
అయితే ఇటీవల ఈ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయని, ఇద్దరూ వేరుగా ఉండే పరిస్థితి వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చేలా మౌనీ రాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో భర్తకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను తొలగించినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి ఫొటోలను మాత్రం అలాగే ఉంచడం గమనార్హం.
సెలబ్రిటీల సోషల్ మీడియా చర్యలు తరచూ ఊహాగానాలకు దారితీస్తున్న నేపథ్యంలో, ఈ అంశంపై మౌనీ రాయ్ లేదా ఆమె కుటుంబం నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ వార్తలు కేవలం రూమర్లుగానే కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అభిమానులు మాత్రం నిజం ఏమిటో తెలుసుకోవాలనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…