ఏపీలో కొత్త రోగం.. వింత అరుపులతో కింద పడుతున్న ప్రజలు..?

ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంటే మరోవైపు కొత్త రోగాలు ప్రజలను మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు ప్రజలు కళ్లు తిరిగి వింత అరుపులతో పడిపోతూ ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మరో కొత్త వ్యాధి విజృంభించిందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లో పదుల సంఖ్యలో ప్రజలు కళ్లు తిరిగి పడిపోయినట్లు తెలుస్తోంది.

ఊహించని విధంగా ప్రజలు కింద పడిపోతూ ఉండటంతో అక్కడ నివశించే ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గజగజా వణకాల్సి వస్తోంది. ఇప్పటివరకు మొత్తం 23 మంది అస్వస్థతకు గురి కాగా కొత్తగా మరికొన్ని కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వాళ్లు ఏలూరు ప్రభుత్వ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏలూరులో వైద్య సిబ్బంది పర్యటించి ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు నిర్వహించింది.

ఆస్పత్రిలో చేరిన వారంతా వింతగా అరుస్తూ ఉండటం గమనార్హం. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మంత్రి ఆళ్ల నాని బాధితులను ఇప్పటికే పరామర్శించి వ్యాధి లక్షణాలను అడిగి తెలుసుకున్నారు. పడమర వీధికి చెందిన కొంతమంది కళ్లు తిరిగి పడిపోతున్నారని.. మెరుగైన వైద్యం కోసం కొందరిని విజయవాడ ఆస్పత్రికి తరలించామని మంత్రి వెల్లడించారు.

అయితే మొత్తం 23 మంది అస్వస్థతకు లోను కాగా 22 మంది అస్వస్థతకు గురయ్యారని సమాచారం. అయితే ఒక పాప ఆరోగ్య పరిస్థితి మాత్రం తీవ్ర విషమంగా ఉందని సమాచారం. అయితే 23 మంది కళ్లు తిరిగి పడిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.