ఒక్కో ప్రాంతంలో ఒక్కో రుచికరమైన వంట బాగా ఫేమస్ అయ్యి ఉంటుంది.అంటే ఆ రుచికరమైన ఫుడ్ ను అక్కడ ప్రజలు బాగా ఇష్టపడతారు అన్నమాట. అలాగే మన నాలుక కూడా కొన్ని కొన్ని రకాల రుచులను ఇష్టపడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఇష్టమైన రుచి మరొక వ్యక్తికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలోని వ్యక్తులందరూ భిన్నమైన రుచులను కలిగి ఉంటారు. అంతెందుకు ఒకే కుటుంభంలోని నలుగురు వేరు వేరు రుచులను ఇష్టపడతారు. ఒకళ్ళకి తీపి అంటే ఇష్టం. మరొకరికి కారం అంటే ఇష్టం. ఇలా అందరి రుచులు వేరుగా ఉంటాయి.
అయితే తీపి సంగతి పక్కన పెడితే కారంను కూడా చాలా మందే తింటారు. ఇక తినక తినక ఒక్కసారి కారం తింటే అలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుకంతా మంటగా మారడంతో పాటు, కళ్ళల్లో నుంచి నీరు కూడా బయటకు వస్తుంది. మంట అని అనిపించినప్పుడు వెంటనే వెళ్లి గుప్పెడంత చక్కెరను నోట్లో వేసుకుంటారు. అయితే ఇలా కారంతో నోరు మంటగా ఉన్నప్పుడు చక్కెర ను తినడం అంత మంచిది కాదు..చక్కెరకు బదులుగా కొన్ని పదార్థాలు తినడం వలన కారం వలన వచ్చే మంట తగ్గడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచి జరుగుతుంది అంట.. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. !!
బాగా కారంగా ఉన్న పదార్థాలను తినడం వల్ల నోరంతా మంటగా మారితే వెంటనే ఒక గ్లాస్ పాలు తాగాలట. ఇలా పాలు తాగడం వల్ల పాలల్లో ఉండే కేసీన్ నాలుకపై ఏర్పడే మంటను తగ్గిస్తుంది. అలాగే ఎక్కువ కారం తిని నాలుక మంట పుడుతుంటే బ్రెడ్, అన్నం, ఉడికిన ఆలుగడ్డలు వంటి పిండి పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీని వల్ల నాలుక మంట తగ్గుతుంది. అలాగే చెక్కర బదులుగా ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయ రసాన్ని నోట్లో పిండుకోవాలి. అప్పుడు ఆ పుల్లటి రసం నాలుక మంటను తగ్గిస్తుంది. అలాగ్వ ఇంట్లో తేనె ఉంటే ఒక టీస్పూన్ తేనెను నోట్లో వేసుకుని కొంత సేపు అలాగే ఉంచి అనంతరం ఆ తేనెను మింగేయాలి. దీంతో నాలుక, నోట్లో ఉన్న కారం మంట తగ్గుతుంది.అయితే ఇవేమి లేని పక్షంలో, మంచినీళ్లు తాగిన మంట నుండి ఉపశమనం లభించకపోతే అప్పుడు చక్కెరను తినొచ్చు. కానీ చక్కెరను వెంటనే నమిలి మింగేయకూడదు. కొంత సేపు నోట్లో అలాగే ఉంచుకోవాలి.అప్పుడే మంట తగ్గుతుంది..
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…