200 కోట్ల మనీలాండరింగ్ లో సుకేష్ చంద్రశేఖర్ పేరుతో పాటు బాలీవుడ్ బ్యూటీస్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి పేర్ల ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు విచారించారు.
ఈ బ్యూటీకి ఆ మోసగాడు 52 లక్షల విలువైన గుర్రాన్ని ఇచ్చాడని, మరో నటి నోరా ఫతేహికి కోటి విలువైన కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు.. అసలు ఈ సుకేష్ చంద్ర శేఖర్ ఎవరనేది వాకబు చేస్తున్నారు నెటిజన్లు… అయితే.. సుకేష్ చంద్రశేఖర్ 17 ఏటనే తన ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు. కరుణా నిధి కొడుకునంటూ.. వైఎస్ మేనల్లుడినంటూ చెప్పుకుంటూ మోసాలు చేస్తున్నాడు.
ముఖ్యంగా ప్రముఖులను, రాజకీయ నాయకులను, బాలీవుడ్ ప్రముఖులను మోసం చేయడం ప్రారంభించాడు. చెన్నైతో పాటు ముంబై నగరాల్లో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. 2010లో సుకేష్‌కి మోడల్, నటి లీనా పాల్‌తో పరిచయం అయింది. వారి మధ్య ఉన్న స్నేహం క్రమంగా పెరిగి ఇద్దరూ సహజీవనం చేశారు. 2015లో సుకేష్, లీనా ముంబైకి షిఫ్ట్ అయ్యారు.
ఇక్కడ నకిలీ పథకాల ద్వారా 450 మందిని మోసం చేసి 19.5 కోట్ల రూపాయల కాజేశారు. అనంతరం ఇద్దరిపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. సుకేష్.. రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు శివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్‌ను జైలు నుంచి బయటకు తీసుకువస్తానని చెప్పి.. వారి భార్యల నుంచి 200 కోట్లకు పైగా తీసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత ఇతనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…