రాజమౌళికి నేను అవసరం లేదు.. నన్ను అర్ధం చేసుకోకుండా 6 సార్లు బ్యాన్ చేసారు : ప్రకాష్ రాజ్

దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరం లేదు. ప్రస్తుతం అతడు దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నటుడిగా ఏ పాత్రకైనా న్యాయం చేస్తాడు ప్రకాష్ రాజ్. అటు విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా కూడా ఎన్నో సినిమాలు చేశారు.అతడు రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన నటుడు ప్రకాశ్ రాజ్.

ఇప్పటి వరకు నాలుగు జాతీయ అవార్డులను అందుకున్నాడు. నటుడిగా ఆయనకు తొలుత గుర్తింపు తెచ్చిన చిత్రం కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యుయెట్’. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు చిత్రంలో నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు. ‘కాంచీవరం’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు. అయితే ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ప్రకాష్ రాజ్ హిస్టారికల్ సినిమాలు పెద్దగా ఎందుకు చేయలేదు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. ప్రకాష్ రాజ్ సమాధానం చెబుతూ.. ఇప్పుడు పెద్దగ హిస్టారికల్ సినిమాలు చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. చాలా కొద్ది మంది చేస్తున్నారు అందులో రాజమౌళి ఒకరు. అయితే ఆయన సినిమాకు నా అవసరం పడలేదు అందుకే నాకు అయన సినిమాలో క్యారెక్టర్ ఇవ్వలేదు అని చెప్పారు.. అయితే ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న ప్రకాష్ రాజ్ ను ప్రోడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఆరు సార్లు బ్యాన్ అయ్యారు.

దీనికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ ఇలా సమాధానం చెప్పాడు. అన్ని భాషలకు సంబంధించిన ప్రోడ్యూసర్ కౌన్సిల్లో ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకోలేక పోయారు.. ఎందుకు మిమ్మల్ని ఆ కౌన్సిల్ నుంచి ఆరు సార్ల బ్యాన్ చేయాల్సి వచ్చిందన్న ప్రశ్న అడగ్గా.. కేవలం తెలుగులో మాత్రమే జరిగిందని.. నిర్మాతలు ఒకసారి ఫిర్యాదు చేశారని.. కొన్నిసార్లు దర్శకులు ఇబ్బంది పడటంతో కూడా ఫిర్యాదు చేశారని.. మరో సారి ఆర్టిస్ట్ అసోషియేషన్ కు సంబంధించి సభ్యులు క్రమశిక్షణా చర్యల కింద కూడా ఫిర్యాదు చేశారన్నారు.

ఇందులో ఎవరినీ తప్పు పట్టలేమని.. తాను ముక్కుసూటిగా మాట్లాడతానాని అది కొంతమందికి నచ్చక ఇలా ఫిర్యాదు చేశారేమో అని అతడు అభిప్రాయపడ్డాడు. ఇలా కొన్ని కారణాల వల్ల తనను బ్యాన్ చేసిటనట్లు చెప్పారు. తర్వాత కూర్చొని మాట్లాడుకున్నామని.. మొత్తం పరిష్కారం అయిందన్నారు. దాన్ని ఎదుర్కొని సమాధానం చెప్పి.. ముందుకు వెళ్లాలనేది లైఫ్ అన్నారు.