Bheemla Nayak: భీమ్లా నాయక్ ట్రైలర్ ఏంటి అలా ఉంది..? నిరుత్సాహంలో ఫ్యాన్స్..?
Bheemla Nayak: టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ… భీమ్లా నాయక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తమ హీరో సినిమాని థియేటర్ లో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ పాత్రలో ఫ్యాన్స్ ముందుకు రానున్నారు.
మరో కీలక పాత్రలో.. భీమ్లానాయక్ కి ఛాలెంజ్ విసిరే క్యారెక్టర్ లో రానా కనిపించనున్నారు. వీరిద్ధరి మధ్య ఈగో క్లాష్ ఏ రేంజ్ లో ఉంటుందో తెరపై చూడాలంటే… ఈనెల 25 వరకు ఆగాల్సిందే. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ వస్తోంది.
తెలుగు నేటివీటికి సరిపడేలా కథలో మార్పులు చేర్పులు చేశారు. సాగర్ కే. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… స్క్రీన్ ప్లే, మాటలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన థమన్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా నిన్న భీమ్లా నాయక్ ట్రైలర్ రిలీజ్ అయింది. పవన్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసమే చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ అనుకున్న రేంజ్ లో ట్రైలర్ లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ట్రైలర్ నీరసంగా ఉందని.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అసలు బాగా లేదనే టాక్ వస్తోంది. మ్యూజిక్ బాగుంటే బొమ్మ దద్దరిల్లిపోయి ఉండేదని అంటున్నారు. దీనిపై థమన్ క్లారిటీ ఇచ్చారు.‘‘ అన్ని ట్రైలర్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా అమ్మా.. థియేటర్ లో ర్యాంప్ అమ్మా..ఫారెస్ట్ ఫైర్ కు లోక్ ఫైర్ కు తేడా ఉండాలి కదా.. కలుద్దాం అంటూ ట్విట్ చేశాడు. ఇక థియేటర్లలో థమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…