అక్కినేని వారసుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ స్టోరీ’.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఖాలీ సమయంలో దొరకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ మొదలెట్టాడు శెఖర్ కమ్ముల. అందులో భాగంగా హీరో రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘నం.1 యారి’షోలో ‘లవ్‌స్టోరీ’ టీమ్ సందడి చేసింది.
ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమయ్యే ఈ షోలో శేఖర్ కమ్ముల గురించి హీరో చైతన్య, హీరోయిన్ సాయిపల్లవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.సెట్‌లో ఆయన ఎలా ఉంటాడు. కోపం వస్తే ఏం చేస్తాడు తదితర విషయాలను బయటపెట్టారు. శేఖర్ కమ్ముల ప్రత్యేక ఏంటని సాయిపల్లవిని అడగ్గా.. ఆయన విషయంలో తాను కొంచెం పొసెసీవ్ అని చెప్పింది. నేను సెట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా చైని మెచ్చుకుంటే నేను శేఖర్ కమ్ములగారి వైపు కోపంగా చూస్తుంటా.
అసలు నాకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆయనకు సలహాలు ఇస్తాను. ఆయన దానికి ఎలా స్పందిస్తారా..? అని ఎదురుచూస్తుంటా’అని సాయిపల్లవి చెప్పింది.ఇక శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. తాను ఎవరిని ఎక్కువగా పొగడనని, గుడ్ అని చెప్పానని, నచ్చకపోతే మానిటర్ దగ్గర నుంచి వెళ్లిపోతానని శేఖర్ చెబుతుండగా నాగచైతన్య కల్పించుకొని ‘దాదాపు గుడ్ అంటారు. ఈ మధ్య ‘యాక్’అనే పదం కూడా నేర్చుకున్నాడు’ అని అనడంలో అంతా ఘొల్లున నవ్వారు.
ఇక రానా స్పందిస్తూ.. ఇది కొత్త పదం అని, తాను మాత్రం ‘యాక్’ అనిపించుకునేంత దారుణంగా మాత్రం తాను ఎప్పుడూ చేయలేదని చెప్పాడు.దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వేశారు.అన్నట్టు మన దగ్గుబాటి రానా హీరోగా పరిచయం అయ్యింది శేఖర్ కమ్ముల డైరెక్షన్ లోనే. శేఖర్ కమ్ముల తెరక్కించిన లీడర్ సినిమాతోనే రానా వెండితెరకు హీరోగా పరిచయం అయ్యాడు.ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది..!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…