Health News

ప్లేట్ లెట్స్ తగ్గాయా.. అయితే ఈ ఆహారం తీసుకోవాల్సిందే!

మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే తప్పనిసరిగా మన శరీరంలోని ప్రతి ఒక్క అవయవం, ప్రతి ఒక్క కణం సరైన క్రమంలో పని చేస్తేనే మనం ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. అయితే మన ఆరోగ్యం నిలకడగా ఉండాలన్నా మన శరీరంలో రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా ఉండాలి. కొందరికి కొన్ని కారణాల వల్ల శరీరంలో ప్లేట్లెట్స్ పూర్తిస్థాయిలో తగ్గిపోతాయి. ఇలా తగ్గిపోవడం వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటే ప్రాణానికే ప్రమాదం వాటిల్లవచ్చు.

మన శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గినప్పుడు ఎక్కువగా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడతాము. అదేవిధంగా ముక్కులో నుంచి రక్తం కారడం, నోటిలో చిగుళ్ల నుంచి రక్తం కారడం, మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే మన శరీరంలో ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా తగ్గిందని అర్థం.ఈ విధమైనటువంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

మన శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల తొందరగా ప్లేట్లెట్స్ సంఖ్య పెంచుకోవచ్చు.మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి అనే విషయానికి వస్తే ప్లేట్లెట్స్ సంఖ్య పెంచడానికి దానిమ్మపండ్లు కీలకపాత్ర పోషిస్తాయి. దానిమ్మ విత్తనాలను లేదా దానిమ్మ పండ్ల జ్యూస్ తాగడం వల్ల మన శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

అదేవిధంగా గుమ్మడికాయలో అధిక మొత్తంలో పోషకాలు ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే.బాగా పండిన గుమ్మడి కాయలోని గుజ్జు మొత్తం బయటకు తీసి ఆ రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగడం ద్వారా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. మన రక్తంలో ప్లేట్లెట్ సంఖ్యను పెంచడానికి బొప్పాయి కీలకపాత్ర పోషిస్తుంది.బాగా పండిన బొప్పాయిని తినడం లేదా బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం ద్వారా మన శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచుకోవచ్చు. వీటితోపాటు టమోటో, నిమ్మ,సీ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago