1983 మద్రాస్, శారదా స్టూడియో లో రెండు ఫ్లోర్స్ లలో షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఒక ఫ్లోర్ లో చిరంజీవి హీరోగా “సింహపురి సింహం” సినిమా షూటింగ్ జరుగుతుండగా, మరొక ఫ్లోర్ లో విజయశాంతి ప్రధాన పాత్రలో “నేటి భారతం” సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమా షూటింగ్ విరామ సమయంలో చిరంజీవి బయటకు వచ్చారు.ఆ క్రమంలో ఆయనను చూసిన విజయశాంతి చిరంజీవి దగ్గరికి వెళ్లి పలకరించింది. అలా మొదలైన వీరి పరిచయం అనతికాలంలోనే వీరి కలయికలో ఓ సినిమా పట్టాలెక్కింది.
“పెళ్లి చూపులు” చిత్రంలో విజయశాంతిని చూసిన డి.రామానాయుడు చిరంజీవితో తాను తీయబోతున్న సంఘర్షణ చిత్రంలో హీరోయిన్ గా విజయశాంతిని తీసుకున్నారు. అలా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సంఘర్షణ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో రెండవ సినిమా.. నారాయణ రావు నిర్మాతగా, ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో “దేవాంతకుడు” సినిమా వచ్చింది. 3వ, సినిమా మహానగరంలో మాయగాడు, 4వ, సినిమా చాలెంజ్, 5వ, సినిమా చిరంజీవి, 6వ,సినిమా కొండవీటి రాజా, 7వ సినిమా ధైర్యవంతుడు, 8వ సినిమా చాణక్య శపథం, 9వ సినిమా పసివాడి ప్రాణం, 10వ సినిమా స్వయంకృషి, 11 వ సినిమా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 12వ సినిమా యముడికి మొగుడు, 13వ సినిమా యుద్ధభూమి, 14వ సినిమా మంచి దొంగ, 15వ సినిమా రుద్రనేత్ర, 16వ సినిమా కొండవీటి దొంగ, 17వ సినిమా స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, 18వ సినిమా గ్యాంగ్ లీడర్, 19వ సినిమా మెకానిక్ అల్లుడు.
1993లో గీత ఆర్ట్స్,బి.గోపాల్ దర్శకత్వంలో మెకానిక్ అల్లుడు చిత్రం విడుదల అయ్యింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. హిట్స్ సూపర్ హిట్స్ ఇండస్ట్రీ హిట్స్ వంటి చిత్రాలను అందించిన ఈ జంట.. సంఘర్షణ అనే విజయవంతమైన చిత్రంతో ప్రారంభమై.. మెకానిక్ అల్లుడు సినిమా పరాజయంతో ఇక వీరి కలయికలో ఇప్పటి వరకు మరో చిత్రం రాలేదు. 1990 వరకు చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ గా రాధిక ఉండేవారు.
కానీ ఆ తర్వాత అనూహ్యంగా విజయశాంతి మొదటి స్థానంలోకి వచ్చారు. ఈ మధ్యకాలంలో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు”అనే చిత్రం “మెగా సూపర్ ఈవెంట్” కి గెస్ట్ గా చిరంజీవి, విజయశాంతి వచ్చారు. చిరంజీవి ఈవెంట్ లో మాట్లాడుతూ.. విజయశాంతి, తను ఎన్నో చిత్రాల్లో కలిసి చేశామని తమ పాతకాల మధురానుభూతులను గుర్తు చేశారు. వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందేమో వేచి చూద్దాం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…