Categories: FeaturedMovie News

‘జెంటిల్‌మ్యాన్’ సినిమాను రాజ‌శేఖ‌ర్‌ వదులుకోవడానికి గల కారణం ఇదే..

డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా బంపర్ హిట్ అయ్యాయి. అతడి దర్శకత్వ మెలకువలు అలా ఉంటాయి మరి. ప్రతీ సినిమాలో ఏదో విభిన్నమైన కథాంశాన్ని తెరకెక్కిస్తారు. అయితే అతడి మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా జెంటిల్ మెన్.

ఇందులో అర్జున్ హీరోగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అప్పటి నుంచి శంకర్ పేరు సినీ పరిశ్రమలో మారుమోగిపోయింది. తర్వాత అతడు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రతీ సినిమా హిట్ బాటలో నడిచాయి. జెంటిల్ మెన్ నుంచి మొన్న వచ్చిన రోబో 2.0 వరకు తన దర్శకత్వ మార్కును చూపించారు.

ఇదిలా ఉండగా.. 1993 లో వచ్చిన జెంటిల్‌మ్యాన్ సినిమాని మొద‌ట శంక‌ర్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌తో తీయాలనుకున్నారట. అప్పట్లో రూ.10 లక్షలు చేతపట్టుకొని అతడి వద్దకు వెళ్లాడట శంకర్ . ఎందుకంటే అప్పట్లో రాజశేఖర్ నటించిన సినిమాలు ఆహుతి, అంకుశం వంటి సినిమాలు అతడికి మంచి ఫేమ్ తీసుకొచ్చాయి. అయితే శంకర్ చెప్పిన సినిమాను అతడు తిరస్కరించాడట..

ఎందుకంటే.. అతడు అప్పటికే కె. రాఘ‌వేంద్ర‌రావుతో ‘అల్ల‌రి ప్రియుడు’ సినిమా చేయ‌డానికి అంగీక‌రించి, దానికి డేట్స్ ఇచ్చేశారు రాజ‌శేఖ‌ర్‌. జెంటిల్ మ్యాన్ కథ రాజశేఖర్ కు నచ్చినా డేట్స్ ఇవ్వడానికి కుదరలేదు. దీంతో అలా రాజశేఖర్ జెంటిల్ మ్యాన్ సినిమాను మిస్ చేసుకున్నారు. జెంటిల్‌మ్యాన్‌ సినిమాను వదులుకోవడం తన కెరీర్ లో పెద్ద లాస్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రపంచంలో అత్యధిక బంగారం ఎవరిది?భారత్‌ని మించి అత్యధిక బంగారం ఎవరిదో తెలుసా?

ప్రపంచ ఆర్థిక గణాంకాలను ప్రభావితం చేసే ఒక అంశం “బంగారు నిల్వలు” (Gold Reserves). యుద్ధాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాల…

14 minutes ago

పిల్లల పేర్లలో కన్ఫ్యూజన్? సంప్రదాయం, జ్యోతిష్యం, మోడరన్ ట్రెండ్ – ఏది సరైన ఎంపిక?

ఇంట్లో చిన్నారి పుట్టిన క్షణం నుంచి ఆనందం మొదలవుతుంది. కానీ ఆ ఆనందంతో పాటు ఒక ముఖ్యమైన చర్చ కూడా…

28 minutes ago

మద్యం వల్లనే కాదు… వీటి వల్ల కూడా లివర్‌ దెబ్బతింటుంది..

కాలేయం (లివర్‌) మన శరీరంలో అత్యంత కీలక అవయవాల్లో ఒకటి. శరీరానికి అవసరమైన పోషకాలను ప్రాసెస్ చేయడం, విషపదార్థాలను బయటకు…

58 minutes ago

చిరంజీవి కాదు… ఇండియాలో బెస్ట్ యాక్టర్ అతనే.. రాధికా ఓపెన్ కామెంట్.!

దక్షిణాది సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి రాధికా శరత్ కుమార్ మరోసారి వార్తల్లో…

1 hour ago

7 సీటర్ కారు కొనాలనుకుంటున్నారా? మార్కెట్లోకి కొత్త MPVలు… కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్స్..

ఉమ్మడి కుటుంబాలతో కలిసి ప్రయాణాలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సెలవులు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు—ఇలాంటి సమయాల్లో ఒకే వాహనంలో…

2 hours ago

అమెజాన్‌లో Galaxy S24 – భారీ తగ్గింపు, ఫీచర్లు ఇప్పుడు తెలుసుకోండి

కొద్ది రోజుల్లో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ మార్కెట్‌లోకి రాబోతోంది. అంతకు ముందే, S24 స్మార్ట్‌ఫోన్ ధరలో పెద్ద తగ్గింపు…

3 hours ago