డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా బంపర్ హిట్ అయ్యాయి. అతడి దర్శకత్వ మెలకువలు అలా ఉంటాయి మరి. ప్రతీ సినిమాలో ఏదో విభిన్నమైన కథాంశాన్ని తెరకెక్కిస్తారు. అయితే అతడి మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహించిన సినిమా జెంటిల్ మెన్.

ఇందులో అర్జున్ హీరోగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బంపర్ హిట్ కొట్టింది. అప్పటి నుంచి శంకర్ పేరు సినీ పరిశ్రమలో మారుమోగిపోయింది. తర్వాత అతడు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ప్రతీ సినిమా హిట్ బాటలో నడిచాయి. జెంటిల్ మెన్ నుంచి మొన్న వచ్చిన రోబో 2.0 వరకు తన దర్శకత్వ మార్కును చూపించారు.
ఇదిలా ఉండగా.. 1993 లో వచ్చిన జెంటిల్‌మ్యాన్ సినిమాని మొదట శంకర్ డాక్టర్ రాజశేఖర్‌తో తీయాలనుకున్నారట. అప్పట్లో రూ.10 లక్షలు చేతపట్టుకొని అతడి వద్దకు వెళ్లాడట శంకర్ . ఎందుకంటే అప్పట్లో రాజశేఖర్ నటించిన సినిమాలు ఆహుతి, అంకుశం వంటి సినిమాలు అతడికి మంచి ఫేమ్ తీసుకొచ్చాయి. అయితే శంకర్ చెప్పిన సినిమాను అతడు తిరస్కరించాడట..
ఎందుకంటే.. అతడు అప్పటికే కె. రాఘవేంద్రరావుతో ‘అల్లరి ప్రియుడు’ సినిమా చేయడానికి అంగీకరించి, దానికి డేట్స్ ఇచ్చేశారు రాజశేఖర్. జెంటిల్ మ్యాన్ కథ రాజశేఖర్ కు నచ్చినా డేట్స్ ఇవ్వడానికి కుదరలేదు. దీంతో అలా రాజశేఖర్ జెంటిల్ మ్యాన్ సినిమాను మిస్ చేసుకున్నారు. జెంటిల్‌మ్యాన్ సినిమాను వదులుకోవడం తన కెరీర్ లో పెద్ద లాస్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.































