Hero Suman: నేను జైలుకు వెళ్లినప్పుడు ఒక్క హీరో కూడా సహాయం చేయలేదు: సుమన్
Hero Suman:టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల క్రితం మెగాస్టార్ చిరంజీవితో పాటు పోటీగా నటించిన హీరోలలో ఒకరు. అప్పట్లో చిరంజీవి సుమన్ సినిమాలకు భారీ పోటీ ఉండేది.అయితే ఒక కారణం వల్ల సుమన్ జైలుకు వెళ్లి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ క్రమంలోనే తన కెరియర్ కూడా ఇబ్బందుల్లో పడిన సంగతి మనకు తెలిసిందే.
ఇక ఈ మధ్య కాలంలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన సుమన్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన కెరియర్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.ఇక ఈయన జైలుకు వెళ్లిన సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో చాలామంది ప్రొడ్యూసర్లు తనకు ఆర్థిక సహాయం చేశారని సుమన్ వెల్లడించారు.
ఇకపోతే మీరు జైలుకు వెళ్లిన సమయంలో ఏ హీరోలైన మీకు సహాయం చేశారా అని పరోక్షంగా ప్రశ్న ఎదురవడంతో సుమన్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.తాను జైలుకు వెళ్లినప్పుడు ఏ హీరో నుంచి తనకు ప్రత్యక్షంగా సహాయం అందలేదని తనకు తెలియకుండా ఎవరైనా సహాయం చేశారేమో తెలియదు కానీ, తనకు తెలిసి ఏ ఒక్క హీరో కూడా తనకు సహాయం చేయలేదని ఈ సందర్భంగా సుమన్ వెల్లడించారు.
ఆ సమయంలో నా కోసం ఏ హీరోలు సహాయం చేయక పోయినప్పటికీ నాకు తెలిసి కొంత మంది హీరోయిన్స్ ఓపెన్ గా నాకోసం ఒక తమిళ మ్యాగజైన్ కి స్టేట్మెంట్ ఇచ్చారు. వారిలో సుమలత, భానుప్రియ, సుహాసిని గారు ఉన్నారు. సుమన్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఎంతో మంచి వారు, చాలా డిసిప్లిన్ ఉన్నవారు. అయితే ఆయనపై ఏదో కుట్ర జరిగింది అంటూ ఈ హీరోయిన్స్ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారని సుమన్ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…