సాధారణంగా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అయితే ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై వారి కెరియర్ ను కొనసాగిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఈ క్రమంలో పలువురు బుల్లి తెర నటీనటులుగా గుర్తింపు పొందిన తర్వాత వారికి సినిమా అవకాశాలు వస్తాయి అలా అవకాశాలు పొందిన వారిలో మౌనరాగం హీరోయిన్ ప్రియాంక జైన్ ఒకరు.
ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న మౌనరాగం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈమె బెంగళూరుకు చెందిన నటి అయినప్పటికీ అచ్చతెలుగు అమ్మాయిగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకుంది.మౌనరాగం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రియాంక జైన్ ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ లో జానకి పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు.
ఇలా బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు వెండితెరపై నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న బంగార్రాజు చిత్రం తర్వాత నాగార్జున తరువాత చిత్రంలో ఈమె నాగార్జున సిస్టర్ పాత్రలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇలా బుల్లితెరపై స్టార్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియాంక జైన్ వెండితెరపై కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.అయితే ఈమెకు నాగార్జున సినిమాలో అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…