బిగ్ బాస్ కార్యక్రమం మరో రెండు వారాలలో ముగుస్తున్న నేపథ్యంలో హౌస్ లో ఉన్నటువంటి 6 మంది కంటెస్టెంట్ లు తమదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేలా నిర్వాహకులు ఈ షోని ప్లాన్ చేశారు.ఈ క్రమంలోనే హౌస్ లో ఉన్న ఆరు మంది కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు.
ఇక మంగళవారం ఎపిసోడ్ లో భాగంగా ‘రోల్ ప్లే’టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్‌బాస్-5 కంటెస్టెంట్స్ ఎవరెలా ప్రవర్తించారో చేసి చూపిస్తూ సందడి చేశారు. ఈ క్రమంలోనే ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో క్యారెక్టర్ ను ఇమిటేట్ చేస్తూ చూపించారు. ఇక ఈ టాస్క్ లో భాగంగా కాజల్, మానస్, సన్నీ మధ్య పెద్ద గొడవ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
టాస్క్ లో భాగంగా మానస్ పాత్రలో ఉన్నటువంటి కాజల్ మాటిమాటికి ప్రియాంక సింగ్ కి ఐ లవ్ యు చెబుతుంది. ఇక తన పాత్ర గురించి మానస్ ముందుగానే హెచ్చరించారు. గబ్బు గబ్బు చేస్తే బాగుండదని మానస్ చెప్పినప్పటికీ ఎలా అనిపిస్తే అలా చేస్తామని సన్నీ అనగా ఎంటర్టైనింగ్ చేస్తున్నామని కాజల్ సమాధానం చెప్పింది.
అందుకు మానస్ ఎంటర్టైనింగ్ చేస్తే చెయ్యి కానీ వంద సార్లు ఐ లవ్ యు ఎవడు చెప్పాడు? అంటూ మానస్ కాజల్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా కాజల్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్తుంది. మరి ఇలా ఫన్నీ టాస్క్ లో భాగంగా వీరి మధ్య జరిగిన ఈ గొడవ ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో, ఈ గొడవ కారణంగా ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అనేది తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…