ప్రతీ మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. రోజంతా కష్టపడిన తర్వాత రాత్రిళ్లు నిద్ర పోవడం ఎంతో ఆవశ్యం. శరీర భాగాలకు అది ఎంతో రిలాక్స్ ను అందించినట్లు అవుతుంది. అయితే రాత్రిళ్లు ఇలా సహజంగానే అందరికీ నిద్ర వస్తుంది. కానీ మధ్యాహ్నం కూడా చాలమందికి భోజనం చేసిన తర్వాత కాస్తంత కునుకు వస్తుంది. ఈ నిద్ర ఆరోగ్యానికి శ్రేయస్కరమా లేక హాని చేస్తాయా అంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.
మధ్యాహ్నం భోజనం తర్వాత కాస్త కునుకు తీస్తే ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం కునుకు తీస్తే రాత్రి నిద్రరాదేమోనని కొందరు భావిస్తారు.. కానీ అది కేవలం అపోహ మాత్రమే అని నిపుణులు పేర్కొన్నారు. ఇలా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నిద్ర రావడానికి గల కారణం ఏంటంటే.. క్లోమ గ్రంధి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది.
దీని సంకేతాలు మెదడుకు అందగానే సెరటోనిన్ , మెలటోనిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రను ఉత్తేజపరిచే హార్మోన్. ఇది విడుదల అయిందంటే.. వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఒక వేళ ఇలానే నిద్ర వస్తుందంటే.. ఒక గ్రీన్ టీ తాగితే సరిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఒక వేళ అందుబాటులో గ్రీన్ టీ లేకపోతే.. చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే.. నిద్ర అనేది రాదంటూ చెప్పారు. ఇలా మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉన్నవారికి షుగర్, థైరాయిడ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని.. హార్మోన్లు చురుగ్గా పనిచేస్తాయని.. తద్వారా జీర్ణక్రియ సాఫీగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…