General News

అతి తక్కువ ధరలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు.. భారీ ఆఫర్లు..

స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్‌ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌ కార్నివాల్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు ‘ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ ఫోన్‌ కార్నివాల్‌ సేల్‌’ను సెప్టెంబర్‌ 2న ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా పలు మొబైల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది. ఇందులో భాగంగానే ఐఫోన్‌ 12పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. రూ. 79,900గా ఉన్న ఈ ఫోన్‌ ఆఫర్లో భాగంగా రూ. 66,999కే లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్‌లో భాగంగా రూ.15,000 వరకు ధర తగ్గుతుంది. గూగుల్‌ పిక్సెల్‌ 4ఏను సేల్‌లో భాగంగా రూ. 31,999కే అందిస్తున్నారు.

ఇక యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందొచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన డెబిట్‌ కార్డు ద్వారా నెలకు రూ. 2,694ల ఈఎమ్‌ఐతో కూడా ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. ఇలా ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది Flipkart.

ఒక వేళ మీరు స్మార్ట్ ఫోన్ ను కొనాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ లో భారీ తగ్గింపు ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి ఎక్స్‌ 7 మ్యాక్స్‌5జీ ధర రూ. 26,999కి అందుబాటులో ఉండగా.. ఎమ్‌ఐ 10టీ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ రూ. 34,999కి లభించనుంది. అంతే కాకుండా కొన్ని మొబైల్స్ పై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌తో పాటు నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago