స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ కార్నివాల్ పేరుతో తీసుకొచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకర్షించేందుకు ‘ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్ ఫోన్ కార్నివాల్ సేల్’ను సెప్టెంబర్ 2న ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా పలు మొబైల్స్‌పై ఆకర్షణీయమైన ఆఫర్లు అందించింది. ఇందులో భాగంగానే ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. రూ. 79,900గా ఉన్న ఈ ఫోన్ ఆఫర్లో భాగంగా రూ. 66,999కే లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్‌లో భాగంగా రూ.15,000 వరకు ధర తగ్గుతుంది. గూగుల్ పిక్సెల్ 4ఏను సేల్‌లో భాగంగా రూ. 31,999కే అందిస్తున్నారు.
ఇక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంతేకాకుండా ఎంపిక చేసిన డెబిట్ కార్డు ద్వారా నెలకు రూ. 2,694ల ఈఎమ్‌ఐతో కూడా ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇలా ఈ సేల్ లో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, తదితర ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది Flipkart.
ఒక వేళ మీరు స్మార్ట్ ఫోన్ ను కొనాలని ప్లాన్ చేస్తే ఈ సేల్ లో భారీ తగ్గింపు ఆఫర్ తో సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి ఎక్స్ 7 మ్యాక్స్5జీ ధర రూ. 26,999కి అందుబాటులో ఉండగా.. ఎమ్‌ఐ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 34,999కి లభించనుంది. అంతే కాకుండా కొన్ని మొబైల్స్ పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో పాటు నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు.




























