జయమాలిని ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్లే కానీ… పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు.. ఎందుకంటే!

జయమాలిని ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమాలలో ఈమె పాట వస్తుందంటే చాలు ఇక ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు . తెరపై జయమాలిని చిందులు వేస్తే తెర బయట ప్రేక్షకులు చిందులు వేసేవారు. అంతగా జయమాలిని డాన్సులు అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకునేవి. అప్పట్లో ఎంతో మంది హీరోయిన్ల కన్నా జయమాలిని ఎంతో అందంగా ఉండడంతో ఈమెకు ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.

సినిమాలో డాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న జయమాలిని హీరోయిన్ గా కూడా పలు సినిమాలలో చేసింది. బాలకృష్ణ మొట్టమొదటి హీరోగా నటించిన “అన్నదమ్ముల అనుబంధం”అనే సినిమాలో హీరోయిన్ గా జయమాలిని సందడి చేశారు. సినిమాలలో వ్యాంప్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు.

కెమెరా ముందు మాత్రమే తన ఒంపుసొంపులను చూపిస్తూ అద్భుతమైన నటనను కనబరిచే జయ మాలిని ప్యాకప్ చెప్పగానే వంటి నిండా దుస్తులతో సెట్ లో ఒక్క నిమిషం కూడా ఉండకుండా ఇంటికి వెళ్ళి పోయేది. ఇలా ఎంతో పద్ధతిగా ఉండటం వల్ల ఈమెతో ఎవరు అసభ్యంగా ప్రవర్తించేవారు కాదు. చాలామంది తమకు జయమాలిని ని అంటే ఇష్టం అని చెప్పుకున్నారు కానీ ఎవరు ధైర్యంగా వెళ్లి ఆమె ఎదుట నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరు చెప్పలేదు.

సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు అద్భుతమైన డాన్సర్ గా కొనసాగిన జయమాలిని 1994లో ఆమె పార్తీపన్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను వివాహం చేసుకొని, ఆ తర్వాత సినిమాలకు స్వస్తి పలికి సంసార బాధ్యతలు చేపట్టారు.ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా వీరిలో ఎవరిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు.

జయమాలిని సినిమాలలో నటించినప్పటికీ ఎంతో పద్ధతిగా ఉండటం వల్ల ఈమె ఎవరితోనూ ప్రేమలో పడలేదు. అదేవిధంగా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఈమెను పెళ్లి చేసుకుంటానని ఎవరు ముందుకు రాలేదు. అలా వచ్చి ఉంటే కచ్చితంగా మా అమ్మ అతనికి ఇచ్చి పెళ్లి చేసేదని ఓ సందర్భంలో జయమాలిని తెలియజేశారు. పార్దీపన్ ఫ్యామిలీ ఫ్రెండ్ కావడంతో అమ్మ వారిని అడుగగా వారు పెళ్లికి ఒప్పుకున్నారు దీంతో పెళ్లి జరిగిపోయింది. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నానని ఇప్పటికైనా తనకు తగ్గ పాత్రలు వస్తే సినిమాల్లో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జయమాలిని తెలిపారు.