Categories: FeaturedMovie News

మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్థం వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు.?

మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం ప్రముఖ బిజినెస్‌ మేన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో హైదరా బాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. చిరంజీవి, రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌, ఉపాసన ఈవిధంగా మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది. అయితే ఈ కార్యక్రమంలో పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్ మాత్రం హాజరు కాలేకపోయారు. తన ఫ్యామిలీలోని ముఖ్యమైన వేడుక అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలోని మెగా ఫ్యాన్స్ మదిలో కొన్ని సందేహాలు మొదలవుతున్నాయి.

ఇదిలావుండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు అడుగు పెట్టకూడదట. నియమ, నిష్టలతో పూజలు చేస్తుండాలట. అందుకనే ఆయన ఈ వేడుకకు హాజరు కాలేకపోయారని పవన్ సన్నిహితులు చెబుతుండగా.. మరి ఈ దీక్షలో ఉన్నప్పుడే టాలీవుడ్ హీరో నితిన్‌ పెళ్లి వేడుకకు వెళ్లారు కదా.? అని మరికొందరు తమ సందేహాన్ని తెలియజేశారు. తన అభిమాని శుభకార్యానికి వెళ్లిన పవర్‌ స్టార్‌, సొంత అన్న కుమార్తె నిశ్చితార్ధానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు మాత్రం మెగా ఫ్యాన్స్ మదిలో ఇంకా మెదులుతూనే వున్నాయి. సొంత ఫ్యామిలీకి దూరంగా వుంటూ కలిసి వుంటే కలదు సుఖం అంటూ స్పీచ్‍లిచ్చే పవన్
కనీసం తన కుటుంబాన్నైనా పంపించవచ్చు కదా అని కొందరడుగుతున్నారు.

ఈ ప్రశ్నలలోనుండి మరో ప్రశ్న పుట్టినట్టుగా మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ ల మధ్య దూరం మళ్లీ పెరిగిందా..? అన్న సందేహాలు బయటికొస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.. సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు ఉండటం వలన పవన్‍ కళ్యాణ్ అసలు వేడుకలో మిస్సయ్యాడు కానీ ఉదయాన్నే మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లి నిహారికను విష్ చేసి, నిహారికకు కాబోయే భర్తతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. ఈవెంట్‍ ఫోటోలు అయితే బయటకు వచ్చాయి కానీ పవన్ నిహారిక ను విష్ చేసిన ఫోటోలు బయటకు రాకపోవడంతో ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. మరి మన మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్‍ వీడియోలో అయినా ఈ అంశంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago