మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థం ప్రముఖ బిజినెస్ మేన్ జొన్నలగడ్డ వెంకట చైతన్యతో హైదరా బాద్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత, శ్రీజ, కల్యాణ్ దేవ్, ఉపాసన ఈవిధంగా మెగా ఫ్యామిలీ మొత్తం వచ్చేసింది. అయితే ఈ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం హాజరు కాలేకపోయారు. తన ఫ్యామిలీలోని ముఖ్యమైన వేడుక అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కాకపోవడంతో సోషల్ మీడియాలోని మెగా ఫ్యాన్స్ మదిలో కొన్ని సందేహాలు మొదలవుతున్నాయి.

ఇదిలావుండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ దీక్షలో సాయంత్రం 6 గంటల తర్వాత బయటకు అడుగు పెట్టకూడదట. నియమ, నిష్టలతో పూజలు చేస్తుండాలట. అందుకనే ఆయన ఈ వేడుకకు హాజరు కాలేకపోయారని పవన్ సన్నిహితులు చెబుతుండగా.. మరి ఈ దీక్షలో ఉన్నప్పుడే టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి వేడుకకు వెళ్లారు కదా.? అని మరికొందరు తమ సందేహాన్ని తెలియజేశారు. తన అభిమాని శుభకార్యానికి వెళ్లిన పవర్ స్టార్, సొంత అన్న కుమార్తె నిశ్చితార్ధానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు మాత్రం మెగా ఫ్యాన్స్ మదిలో ఇంకా మెదులుతూనే వున్నాయి. సొంత ఫ్యామిలీకి దూరంగా వుంటూ కలిసి వుంటే కలదు సుఖం అంటూ స్పీచ్‍లిచ్చే పవన్
కనీసం తన కుటుంబాన్నైనా పంపించవచ్చు కదా అని కొందరడుగుతున్నారు.

ఈ ప్రశ్నలలోనుండి మరో ప్రశ్న పుట్టినట్టుగా మెగా ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ ల మధ్య దూరం మళ్లీ పెరిగిందా..? అన్న సందేహాలు బయటికొస్తున్నాయి. అయితే లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం.. సాయంత్రం పూట పూజా కార్యక్రమాలు ఉండటం వలన పవన్ కళ్యాణ్ అసలు వేడుకలో మిస్సయ్యాడు కానీ ఉదయాన్నే మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లి నిహారికను విష్ చేసి, నిహారికకు కాబోయే భర్తతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. ఈవెంట్ ఫోటోలు అయితే బయటకు వచ్చాయి కానీ పవన్ నిహారిక ను విష్ చేసిన ఫోటోలు బయటకు రాకపోవడంతో ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. మరి మన మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ వీడియోలో అయినా ఈ అంశంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.



























