తెలుగులో చాలా చిత్రాలలో తల్లి పాత్రలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్న “సీనియర్ నటి వెన్నిరాడై నిర్మల” గురించి తెలియని వాళ్ళుండరు. నవతరం ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆమధ్య విడుదలైన సూపర్ హిట్ చిత్రం ‘శంకర్ దాదా MBBS’ లో చిరు తల్లిగా నటించిన నటి అనగానే అందరికీ గుర్తుకొస్తుంది.
ఆరోజుల్లో వెన్నిరాడై నిర్మల మంచి క్రేజీ హీరోయిన్. అయితే ఈమె అసలు పేరు తెలుగు చిత్ర సీమలోకి రాక ముందు శాంతి. కానీ ప్రముఖ తమిళ డైరెక్టర్ శ్రీ సివి శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన “వెన్నిరాడై”
చిత్రంలో హీరోయిన్ గా నటించగా ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అంతే ఇక అప్పటి నుంచి
ఆమెనందరూ వెన్నిరాడై నిర్మల అనే పిలుస్తున్నారు. నిర్మల తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతంలో 1948 జూన్ 28న జన్మించింది. చిన్నప్పటి నుంచి నిర్మలకు నాటకాలన్నా, నాట్యమన్నా ఆసక్తి ఎక్కువగా ఉండటంతో నిర్మల తల్లిదండ్రులు ఆమెకు భరత నాట్యంలో శిక్షణ కూడా ఇప్పించారు. ఆ తర్వాత భారత దేశమంతటా కూడా ఈమె నృత్య ప్రదర్శనలు ఇచ్చినట్టు సమాచారం. నిర్మల తమిళనాడుకి చెందిన అమ్మాయి అయినప్పటికీ.. తమిళంతో పాటు.. మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో కలిపి 200లకు పైగా సినిమాల్లో నటించింది. సినిమాల్లో కూడా మంచి నటిగా బాగా గుర్తింపు సంపాదించుకుంది. అలాగే తమిళంలో 3 సీరియల్స్ లో నటించింది. అంతే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి చెందిన MGR పార్టీకి రాజకీయ పరంగా సేవలు కూడా అందించింది.
ఇక ఈమె వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే.. ఇప్పటి వరకు వెన్నిరాడై నిర్మల కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదని తెలిసింది. ఇందుకు కారణాలేమిటా.? అని ఆరా తీయగా.. వెన్నిరాడై నిర్మల హీరోయిన్ గా మంచి ఫామ్ లో వున్నప్పుడే ఓ తమిళ హీరోని ప్రేమించిందని కానీ వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లి వరకూ వెళ్ళలేదని అందుకనే నేటి వరకు వెన్నిరాడై నిర్మల పెళ్లి చేసుకోలేదని సోషల్ మీడియాలో రూమర్స్ షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా వెన్నెరాడై నిర్మల కూడా తన వ్యక్తిగత జీవితానికి సంబందించిన విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదు. ఏ ఇంటర్వ్యూలోనూ మీడియాతో పంచుకోలేదు. ప్రత్యేకించి ఏ సినిమా వేడుకలకు హాజరయ్యిందీ లేదు. సోషల్ మీడియాకు కూడా ఈమె దూరంగా ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఈమె జీవితం ఒక రహస్య గ్రంధమనే చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…