Categories: FeaturedMovie News

తనను అవమానిచిన వ్యక్తి తో హీరో అయ్యాక శోభన్ బాబు ఎలా ప్రవర్తించారో తెలుసా ?

టాలీవుడ్ సోగ్గాడు, నటభూషణడైన శోభన్ బాబు సినిమాలో హీరో అవ్వాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లి సినిమా అవకాశాల కోసం ఒక డొక్కు సైకిల్ పై ప్రతి స్టూడియో చుట్టూ చక్కర్లు కొట్టే వారు. అప్పటికే అతనికి పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మద్రాసులోనే ఒక రెంట్ ఇంట్లో భార్యా పిల్లలతో జీవితం కొనసాగిస్తూ తల్లిదండ్రుల నుంచి వచ్చిన వంద రూపాయలతో సంసారం సాగదీసిన శోభన్ బాబు సినిమాల్లో ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలనుకొనేవారు. ఆ సమయంలోనే రాజనాల విలన్ గా నటిస్తున్న ఒక సినిమాలో రెండు నిమిషాల పాటు నటించే అవకాశం వచ్చింది. అప్పటివరకు కాళ్లరిగేలా తిరిగినా శోభన్ బాబు ఆ పాత్రలో నటించేందుకు తెగ ఉత్సాహపడ్డారు. అప్పట్లో రాజనాల అంటే సినిమాల్లోనే కాదు బయట కూడా భయపడేవారు. అతని గొంతులో, మొహంలో అంత గాంభీర్యం ఉట్టిపడేది.

అసలే నటించడం కొత్త, మళ్లీ చూస్తేనే భయం కల్పించే రాజనాల తో సన్నివేశం చేయాలనగానే శోభన్ బాబు కి ఎక్కడ లేని భయం పట్టుకుంది. కానీ వచ్చిన ఒక పాత్రను కూడా వదులుకోకూడదనే ఉద్దేశంతో నటించేందుకు ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ సినిమాలో రాజనాల తో రెండు నిమిషాలపాటు అతని పాత్ర ఉండగా… ఆ పాత్ర చేయడానికి శోభన్ బాబు అనేకమైన రీటేక్స్ తీసుకున్నారు. దీంతో బాగా ఆగ్రహించిన రాజనాల ఎవరయ్యా ఇతను, ఎందుకు పట్టుకొచ్చారు, అయ్యా? నటన రాదు పాడు రాదు. నేను అసలు ఈ సన్నివేశంలో చేయను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని గట్టిగా అక్కడి సినీ బృందాన్ని తిట్టి వెళ్లిపోయారు. నలుగురి ముందు రాజనాల తనపై అరవడంతో ఎంతో ఆత్మాభిమానం ఉన్న శోభన్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కానీ రాకరాక వచ్చిన ఒక చిన్న పాత్రలో నటిస్తే కాస్త డబ్బులు అయినా వస్తాయని భార్యా పిల్లల ఖర్చుల కైనా పనికొస్తాయని శోభన్ బాబు తన ఆత్మగౌరవం, ఆత్మాభిమానం చంపుకుని మళ్లీ ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సార్ అని బతిలాడాడు. కానీ ఆ సినీ బృందం రాజనాల కి భయపడి మీరు వద్దులేండి, ఇంటికి వెళ్లిపోండి… ఛాన్స్ ఇచ్చి మళ్లీ రాజనాల చేత మాటలు పడలేమండి అని చెప్పేసారు. దీంతో అవమానానికి గురి అవడంతో పాటు వచ్చిన ఛాన్స్ కూడా పోయేసరికి శోభన్ బాబు బాగా మనస్తాపం చెందాడు.

కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత రాజనాల వ్యసనాలకు అలవాటుపడి నటన పై పూర్తిస్థాయిలో ఆసక్తి కోల్పోయాడు. ఆ సమయంలోనే అతని భార్య కూడా చనిపోయింది. దీంతో రాజనాల ఇంకా మానసికంగా క్రుంగి పోయాడు. ఆదరించాల్సిన కొడుకు కూడా నిర్లక్ష్యం చేసి రూపాయి బిళ్ళ ఇవ్వకుండా బయటకి గెంటేసాడు. దీంతో చేసేదేమీ లేక సినిమా అవకాశాలు రాక, తెలిసిన వాళ్ళ వద్దకు వెళ్లి పదో పరకో అడిగి తన చివరి రోజులు గడుపుతుండేవాడు. ఒకానొక రోజు రాజనాల చాలా దీనస్థితిలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే శోభన్ బాబు చూశాడు. అప్పటికే శోభన్ బాబు అనేక సినిమాల్లో నటించి కోట్లాది రూపాయలు సంపాదించి పెద్దపెద్ద కారులలో తిరుగుతున్నాడు. అనుకోకుండా తన ని అవమానించిన రాజనాల ను చూసిన శోభన్ బాబు వెంటనే కారు దిగి గురువు గారు ఎలా ఉన్నారు నేను శోభన్ బాబు ని నన్ను గుర్తు పట్టారా అంటూ కారులో అతనిని ఎక్కించుకుని తన ఇంటికి తీసుకువెళ్లి కడుపునిండా భోజనం పెట్టించి ఆ తర్వాత ఒక పెద్ద సంచి ఇచ్చి… ఈ కవర్ లో ఏముందో మీరు తెలుసుకోవాలంటే ఇంటి దగ్గర విప్పాల్సిందే అని చెప్పి అతడిని ఇంటిదగ్గర కార్ లో దించేసి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత సంచి లో ఏముందో అని తెరిచి చూసిన రాజనాలకు 25వేల రూపాయలు కనిపించాయి. దాంతో ఒక్కసారిగా రాజనాల కంట నీళ్లు చెమ్మగిల్లాయి. తనని అహంతో అవమానించిన రాజనాలకు కూడా ఒకటి కాదు రెండు కాదు 25 వేల రూపాయల ఆర్థిక సహాయం చేశారంటే శోభన్ బాబు మనసు ఎంత ఉదారమైనదో అర్ధం చేసుకోవచ్చు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago