Srihari -Disco Shanti: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా విలన్ పాత్రలలో నటిస్తూ అలాగే ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించిన వారిలో నటుడు శ్రీహరి ఒకరు. ఇక నేడు ఈయన మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాల ద్వారా ఎప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉన్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఈయన ఉన్నఫలంగా గుండెపోటు సమస్యకు గురై మరణించారు.
ఇక శ్రీహరి మరణంతో తన కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఈయన భార్య డిస్కో శాంతి పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక శ్రీహరి నటుడిగా కొనసాగుతున్న సమయంలో నటిగా ఐటమ్ సాంగ్ డాన్సర్ గా గుర్తింపు పొందిన డిస్కో శాంతి ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో పడిన వీరిద్దరూ తమ జీవితంలో ఏకంగా రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరూ రెండుసార్లు పెళ్లి చేసుకోవడానికి గల కారణమేంటి అనే విషయానికి వస్తే..
1991లో నాగబాబు హీరోగా తెరకెక్కిన దాదల్ ఎక్స్‌ప్రెస్ మూవీ చిత్రీకరణ సమయంలో శాంతితో శ్రీహరికి పరిచయం ఏర్పడింది. ఈ సినిమాలో శ్రీహరి విలన్ పాత్రలో నటించారు. అలాగే డిస్కో శాంతి స్పెషల్ సాంగ్ చేశారు అయితే ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో శ్రీహరి డిస్కో శాంతి వినయం విధేయత ఆమె మంచితనానికి ఫిదా అయి తనకు ప్రపోజ్ చేశారు. ఇలా ప్రపోజ్ చేసిన వెంటనే ఈమె తన ప్రేమను అంగీకరించలేదు.
జాతకాల ప్రకారం…
పది రోజుల తర్వాత శ్రీహరి ప్రేమను యాక్సెప్ట్ చేసిన శాంతి ఏడాది పాటు ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరు ఒక ఆలయానికి వెళ్ళగా అక్కడ పూజారి వీరి జాతకాలని చూసి ఇప్పుడు కనుక మీరు పెళ్లి చేసుకోకపోతే జీవితంలో ఎప్పటికీ ఒక్కటి కాలేరని చెప్పారట దీంతో భయపడిన శాంతి, శ్రీహరి అక్కడే గుళ్లోనే పెళ్లి చేసుకున్నారు. అప్పటికే శాంతి కుటుంబం అంతా తనపై ఆధారపడటంతో తన బాధ్యతలను నిర్వర్తించే వరకు ఈ పెళ్లి గురించి ఎక్కడ చెప్పకూడదని మాట తీసుకుందట. ఇలా తన చెల్లెలు తమ్ముడు బాధ్యతలను నిర్వర్తించిన అనంతరం అధికారికంగా మరోసారి పెళ్లి చేసుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…