General News

ఫేస్ బుక్ ఫ్రెండ్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. మందలించిన భర్త.. చివరికి దారుణం!

ఓ మహిళ తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తితో ఎంతో సన్నిహితంగా మెలిగింది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో ఇరువురు ఫోన్ నెంబర్లు మార్చుకుని చాటింగ్ చేస్తూ ఫోన్ కాల్స్ మాట్లాడేవారు. అయితే తన భార్య కదలికలపై అనుమానం వచ్చిన భర్త తనను మందలించాడు. భర్త వార్నింగ్ ఇచ్చినప్పటికీ భార్య పద్ధతి మార్చుకోకుండా ఏకంగా తన ప్రియుడితో కలిసి తన భర్తను ప్లాన్ చేసి చంపిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మండ్య నగరంలోని గుత్తలు లేఔట్‌లో అల్తాఫ్ మెహది నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య సైదా రిజ్వాన్ వీరికి ముగ్గురు సంతానం. అల్తాఫ్ పీయూ కాలేజ్‌లో ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం అల్తాఫ్ భార్య రిజ్వాన్ కు ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ విధంగా పరిచయం ఏర్పడిన ఆ వ్యక్తికి ఈమె తరచూ ఆర్థిక సహాయం చేసేది. ఈ విధంగా ఆమె తన ఫేస్ బుక్ ఫ్రెండ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.తన భార్య కదలికలపై అనుమానం వచ్చిన భర్త పద్ధతి మార్చుకొని బుద్ధిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు.

అల్తాఫ్ వార్నింగ్ ఇచ్చినప్పటికే ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా ఏకంగా తన ప్రియుడితో కలిసి తన భర్తను చంపి ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న రిజ్వాన్ ప్లాన్ ప్రకారం అందరూ పడుకున్న తర్వాత తన ప్రియుడితో కలిసి అల్తాఫ్ గొంతు నులిమి చంపారు.అనంతరం తన ప్రియుడిని అక్కడి నుంచి పంపించి మరుసటి రోజు ఉదయానికి తన భర్త గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది.

ఈ క్రమంలోనే అల్తాఫ్ అంత్యక్రియలు కూడా జరిగాయి. అయితే అల్తాఫ్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.రిజ్వాన్ తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారమే తన భర్తను చంపినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago