ఓ మహిళ తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తితో ఎంతో సన్నిహితంగా మెలిగింది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటంతో ఇరువురు ఫోన్ నెంబర్లు మార్చుకుని చాటింగ్ చేస్తూ ఫోన్ కాల్స్ మాట్లాడేవారు. అయితే తన భార్య కదలికలపై అనుమానం వచ్చిన భర్త తనను మందలించాడు. భర్త వార్నింగ్ ఇచ్చినప్పటికీ భార్య పద్ధతి మార్చుకోకుండా ఏకంగా తన ప్రియుడితో కలిసి తన భర్తను ప్లాన్ చేసి చంపిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మండ్య నగరంలోని గుత్తలు లేఔట్‌లో అల్తాఫ్ మెహది నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య సైదా రిజ్వాన్ వీరికి ముగ్గురు సంతానం. అల్తాఫ్ పీయూ కాలేజ్‌లో ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం అల్తాఫ్ భార్య రిజ్వాన్ కు ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ విధంగా పరిచయం ఏర్పడిన ఆ వ్యక్తికి ఈమె తరచూ ఆర్థిక సహాయం చేసేది. ఈ విధంగా ఆమె తన ఫేస్ బుక్ ఫ్రెండ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.తన భార్య కదలికలపై అనుమానం వచ్చిన భర్త పద్ధతి మార్చుకొని బుద్ధిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు.
అల్తాఫ్ వార్నింగ్ ఇచ్చినప్పటికే ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా ఏకంగా తన ప్రియుడితో కలిసి తన భర్తను చంపి ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న రిజ్వాన్ ప్లాన్ ప్రకారం అందరూ పడుకున్న తర్వాత తన ప్రియుడితో కలిసి అల్తాఫ్ గొంతు నులిమి చంపారు.అనంతరం తన ప్రియుడిని అక్కడి నుంచి పంపించి మరుసటి రోజు ఉదయానికి తన భర్త గుండెపోటుతో మరణించాడని అందరినీ నమ్మించింది.
ఈ క్రమంలోనే అల్తాఫ్ అంత్యక్రియలు కూడా జరిగాయి. అయితే అల్తాఫ్ కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.రిజ్వాన్ తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారమే తన భర్తను చంపినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.






























