పెళ్లికి ముందే వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. వారిద్దరూ కొద్దిరోజుల పాటు డేటింగ్ లో ఉన్నారు. కొద్దిరోజుల తర్వాత ఇద్దరూ ఎంతో ఇష్టపడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే పెళ్లి అయిన తర్వాత తన భర్తకు సంబంధించి ఒక గుండె పగిలే విషయం తెలిసింది. తన భర్తకు ఏకంగా 47 మంది పిల్లలు ఉన్నారని తెలియడంతో ఆ భార్యకు నోటమాట రాలేదు. ఏంటి 47 మంది పిల్లలా? అతనికి అంత మంది భార్యలు ఉన్నారా అని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. అసలు విషయం ఏమిటంటే..
ఇటీవల కాలంలో ఓ మహిళ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. అందులో తన భర్తకు 47 మంది పిల్లలు ఉన్నారని ఆమె తెలిపింది.అయితే తన భర్త ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకోకుండా పిల్లలు లేని వారికి వీర్యం దానం చేశారని తెలియజేసింది. ఈ విషయం పెళ్లికి ముందే తనకు తెలుసని అయితే కేవలం ఒకరికో ఇద్దరికో దానం చేసి ఉంటారు ఇకపై వీర్యం దానం చేయడం ఆపాలని చెప్పి తనని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు.
పెళ్లి జరిగిన తర్వాత ఒకసారి మీరు ఎంత మందికి వీర్యం దానం చేశారు అని అడగగా అతను 47 మందికి అని చెప్పగానే నా గుండె పగిలిపోయింది. భవిష్యత్తులో ఆ 47 మంది పిల్లలు తనే నా తండ్రి అని మా జీవితాల లోకి వస్తే మేమేం చేయాలి…అతనితో నేను కలిసి ఉండాలా లేక విడాకులు తీసుకోవాలా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసే సన్నిహితులు బంధువులు సలహాలు కోరింది.
ఈ క్రమంలోనే సదరు మహిళా పోస్టు చదివిన నెటిజన్లు ఈ విషయంలో తన భర్త తప్పు ఏమాత్రం లేదని, తన భర్త ఏ మహిళతో సెక్స్ చేయకుండా కేవలం వీర్యం దానం చేసి మంచి పని చేశారని తెలిపారు. అయితే వీర్యం దానం చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి కనుక భవిష్యత్తులో ఎవరు కూడా తమ వద్దకు రారని, పొరపాటున మీరు అతనికి విడాకులు ఇస్తే మీ జీవితంలో ఒక మంచి వ్యక్తిని కోల్పోతారని సదరు మహిళకు సలహా ఇచ్చారు. మరి ఆ మహిళకు మీరిచ్చే సలహా ఏంటో కామెంట్ రూపంలో రాయండి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…