Categories: FeaturedMovie News

ఎస్‌ వీ.రంగారావు.. సూపర్ స్టార్ కృష్ణతో ఏమని ఛాలెంజ్ చేసారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణకి డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పేరున్న సంగతి తెలిసిందే. తేనె మనసులు సినిమా నుంచి కృష్ణ ఏ సినిమా చేసినా ఒక్కసారి కథ నచ్చితే మళ్ళీ దానిగురించి ఏమాత్రం ఆలోచించరు. ఇండస్ట్రీలో ఎలాంటి కొత్త ప్రయోగం చేయాలన్నా కృష్ణ ముందు ఉండేవారు. ఆయనలాగా అప్పటి తరంలో ఉన్న ఏ హీరో అంత ధైర్యం చేసేవారు కాదని ఎన్నో సందర్భాలలో ప్రముఖులు చెప్పిన సందర్భాలున్నాయి. 10 ఏళ్లలో 100 కి పైగా సినిమాలు చేసిన రికార్డ్ తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం కృష్ణకి మాత్రమే ఉంది. అందుకే ఆయన 350 పైచిలుకు సినిమాలు చేశారు.

హీరోగా మంచి క్రేజ్ మీదున్న కృష్ణ ఆ తర్వాత తన సోదరులతో కలిసి నిర్మాణ సంస్థను.. స్టూడియోను ప్రారంభించి సొంతగా సినిమాలు నిర్మించారు. సూపర్ హిట్స్ అందుకుంటున్న కృష్ణ ఇందులో భాగంగా పండంటి కాపురం సినిమాను నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ – విజయ నిర్మల జంటగా నటించారు. ఈ సినిమాను హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన సునెహ్రా సన్సార్ అనే సినిమా ఆధారంగా తెలుగులో రీమేక్ చేశారు. బాలీవుడ్ లో ఈ సినిమా ఎంతగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిందో అంత బ్లాక్ బస్టర్ హిట్ గా తెలుగులో నిలిచింది. ఈ సినిమా కృష్ణ కెరీర్ లో ఓ గొప్ప సినిమాగా నిలిచింది.

ఎస్ వీ రంగారావు గారు ఓ రోజు షూటింగ్ కి రాలేదట.

ఈ సినిమాకి లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించాడు. ఎస్ పి కోదండపాణి సంగీతం అందించిన ఈ సినిమాను జయప్రద పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఎస్ వీ రంగారావు, జమున, గుమ్మడి, అంజలీ దేవీ, ప్రభాకర్ రెడ్డి, బి. సరోజా దేవీ లాంటి అగ్ర తారలు ఇందులో నటించారు. ఇంత భారీ తారాగణం నటించిన ఈ సినిమాకి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఈ సినిమాకి ఓ మేకప్ మేన్ గా పనిచేసిన మాధవరావు గారు ఓ సందర్భంలో వెల్లడించారు. ఇందులో నటించిన ఎస్ వీ రంగారావు గారు ఓ రోజు షూటింగ్ కి రాలేదట.

అందుకు కారణం ఆయన వైన్ తీసుకోవడం వల్ల షూటింగ్ కి వచ్చే ఓపిక లేక రాలేదట. అప్పటికే సెట్‌లో కృష్ణ, విజయ నిర్మళ, జమున, గుమ్మడి, అంజలీ దేవీ, ప్రభాకర్ రెడ్డి, బి. సరోజా దేవీ ..ఇలా ప్రధాన తారాగణం మొత్తం ఉన్నారట. కాంబినేషన్ సీన్ కావడంతో ఆరోజు షూటింగ్ కి తప్పకుండా ఎస్ వీ రంగారావు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన రాలేకపోయారట. షూటింగ్ ఆగిపోవడంతో వేరే వారితో కబురు పెడితే కూడా ఈ ఒక్కరోజుకి నన్ను వదిలేయండ్రా అని అన్నారట. దాంతో ఈ విషయం సెట్ లో ఉన్న వాళ్ళకి తెలిసి ఇబ్బంది పడ్డారట.

గుమ్మడిగారు …కాస్త కోపంతో ఆయన తప్ప మరెవరూ లేరా అని అన్నారట.

అంతేకాదు గుమ్మడిగారు …కాస్త కోపంతో ఆయన తప్ప మరెవరూ లేరా..ఇలా చేస్తున్నాడనే కదా హరనాథ్ ని అవైడ్ చేశాము ఇండస్ట్రీ నుంచి ..ఎందుకు ఎస్ వీ రంగారావునే తీసుకున్నారు అని అన్నారట. ఆ విషయం తీసుకువెళ్ళి ఎస్ వీ రంగారావు మేకప్ మేన్ చెప్పారట. ఈ మాటకి కృష్ణ గారు నాకు అవన్నీ తెలుసండీ ..అయినా ఆయననే ఎందుకు తీసుకున్నానంటే .. ఈ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరని. ఆప్షన్ ఉన్నా ఎస్ వీ రంగారావు చేసినట్టుగా మరెవరూ చేయలేరూ అని. ఇదంతా ఎస్ వీ రంగారావు కి తన పర్సనల్ మేకప్ మేన్ చెప్పాడట.

దాంతో వెంటనే ఎస్ వీ రంగారావు ..మాధవరావుకి ఫోన్ చేసి రేపు నేను వస్తాను.. నువ్వు కృష్ణగారికి చెప్పి ఇప్పటివరకు జరిగిన రష్ మొత్తం చూద్దామని చెప్పారట. ఈ విషయం కృష్ణకి చెప్పగానే ఆయన సరేనని మానేజర్ కి చెప్పి ప్రివ్యూ ఏర్పాటు చేయమన్నారట. ఎస్ వీ రంగారావు – కృష్ణ – మాధవరావు కలిసి ప్రివ్యూ చూసి బయటకి వచ్చి ఎస్ వీ రంగారావు ..కృష్ణగారితో ఒకటే అన్నారట..కృష్ణ ఇప్పటి వరకు తాగి చేసిన రంగారావును చూశారు..ఇప్పుడు తాగకుండా చేసే రంగారావును చూస్తారు. ఈ సినిమా చూసి బయటకి వెళ్ళే ప్రేక్షకుడు నన్ను తలుచుకుంటూ వెళ్ళాలి..చూడు ఛాలెంజ్ అన్నారట.

ప్రతీ ప్రేక్షకుడు ఎస్ వీ రంగారావును తలుచుకుంటూ వెళ్ళారట.

అలాగే అంత గొప్పగా చేశారట ఎస్ వీ రంగారావు. నిజంగా ఆయన చెప్పినట్టుగానే సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు ఎస్ వీ రంగారావును తలుచుకుంటూ వెళ్ళారట. ఇలా ఎస్ వీ రంగారావు – కృష్ణల మధ్య జరిగిన ఓ సంఘటనను ప్రముఖ మేకప్ మేన్ మాధవ గారు వెల్లడించారు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఇందులో చాలా జరిగాయట. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి గొప్ప పేరు తీసుకు వచ్చింది. ఇప్పటికీ ఈ సినిమాకి అభిమానులున్నారంటే అతిశయోక్తి లేదు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పెళ్లిలో మూడు ముళ్లు ఎందుకు వేస్తారు? అసలు రహస్యం ఇదే!

హిందూ వివాహ సంప్రదాయం అనేది కాలానుగుణంగా మారుతూ వచ్చినా, దాని అంతర్భాగమైన ఆచారాలకు మాత్రం ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.…

9 minutes ago

గంగమ్మ రాత్రివేళ గోదావరిలో స్నానం చేస్తుందా? ఆసక్తికర విశ్వాసం!

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన కుండలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యత కలిగిన…

21 minutes ago

తులసి ఆకులు రంగు మారితే ఏమిటి సంకేతం? శుభమా? అశుభమా?

హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. చాలా ఇళ్లలో తులసిని దైవ స్వరూపంగా భావిస్తూ నిత్య…

41 minutes ago

నవగ్రహాల ప్రదక్షిణ ఎలా చేయాలి? చాలామందికి తెలియని నియమాలు!

హిందూ సంప్రదాయంలో నవగ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంది. మన జీవితంలోని అనేక పరిణామాలు గ్రహాల ప్రభావంతోనే జరుగుతాయని విశ్వాసం. అందుకే…

46 minutes ago

వేసవిలో తప్పక తినాల్సిన పండు ఇదే… రోజ్‌ ఆపిల్‌ ప్రయోజనాలు తెలుసా?

వేసవి తీవ్రత పెరిగే కొద్దీ శరీరాన్ని చల్లబరచే ఆహారాలపై ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అలాంటి సీజన్‌ ఫ్రూట్స్‌లో రోజ్‌…

59 minutes ago

90% మందికి తెలియని పండ్లు తినే సరైన టైమ్ ఇదే!

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. కానీ వాటిని ఎప్పుడు తింటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందో…

1 hour ago