ప్రస్తుతం ప్రపంచంలో వెగాన్ ఉద్యమం జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరు వెగాన్ ఉద్యమకారులు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లి రెస్టారెంట్ మొత్తం రక్తం చిమ్మి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే అక్కడికి వచ్చిన కస్టమర్లు ఈ గొడవ మనకెందుకు అంటూ కొంతమంది అక్కడి నుంచి తప్పించుకున్నారు.
సోషల్ మీడియా ప్రభావం వల్ల ఇటీవల కాలంలో వెగన్ ఉద్యమం ఊపందుకుంది. అంటే శాఖాహార ఉద్యమం. ఈ ఉద్యమం సదరు మనిషి కనీసం పాలు తాగినా కూడా జీవహింస అని భావిస్తున్నారు. అలాంటిది కోడి పిల్లలను చంపి వాటిని వివిధ రకాలుగా తయారు చేసుకుని తింటే ఊరికే ఉంటారా. అందుకే ఈ ఉద్యమకారులు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌కు వెళ్లి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో కొంతమంది వెగన్ ఉద్యమకారులు కేఎఫ్‌సీ రెస్టారెంట్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు మైక్ లను ఎల్ఈడి స్క్రీన్ లను అదేవిధంగా ఒక బాటిల్ లో రక్తం తీసుకుని వెళ్లారు.మనం మన అవసరాల కోసం జీవహింస చేసేటప్పుడు అవి ఏ విధమైనటువంటి నొప్పిని భరిస్తాయో ఎల్ఈడి స్క్రీన్ పై చూపెడుతూ, అవి చేసే అర్థనాదాలను మైక్ ద్వారా వినిపించింది.
https://www.facebook.com/vganbooty/videos/882536905805679/
ఈ విధంగా ఉద్యమకారులు రెస్టారెంట్లో తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ క్రమంలోనే తమ వద్ద బాటిల్లో తెచ్చుకున్న రక్తాన్ని మూతతీసి రెస్టారెంట్లో, కౌంటర్ వద్ద ఓ మహిళ చల్లగా అక్కడ ఉన్న సిబ్బంది ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. అదేవిధంగా ఆ మహిళతో పాటు వచ్చిన మరికొందరు ప్లకార్డులను చేతిలో పట్టుకొని జంతు హింస వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ విధంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ఈ క్రమంలోనే రెస్టారెంట్ యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…