ఇంటి నుంచి మహిళ బయటకు అడుగుపెట్టిందంటే చాలు.. ఇంటికి తిరిగి వచ్చే దాకా నమ్మకం లేకుండా పోతోంది. ఎటునుంచి ఎవరు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతారో అనే భయం రోజురోజుకూ పెరిగిపోతోంది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావస్తున్నా.. ఇలాంటి అత్యాచారాలు, హత్యలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఇలాంటి ఘటనలు మన దేశంలో ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలోని తుమకూరు నగర సమీపంలోని బెట్టద బుడద వద్ద చోటు చేసుకుంది. పశువులను మేపడానికి వెళ్లిన ఓ వివాహితను కొందరు దుండగులు అత్యంత దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా.. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని వెళ్లిపోయారు. దీనికి సంబంధించి వివరాలను పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన 35 ఏళ్ల జయలక్ష్మికి చోటాసాబ్ పాళ్యకు చెందిన శివకుమార్ కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె పశువులను మేపడానికి రోజూ తమకు దగ్గర్లో ఉండే.. కొండ ప్రాంతానికి వెళ్తూ ఉండేది. ఇలానే ఓ రోజు ఉదయం పశువులను మేపడానికి వెళ్లిన ఆమె సాయంత్రం అయినా తిరిగి రాలేదు. కంగారు పడిన భర్త ఆమెను వెతుకుంటూ కొండపైకి చేరుకున్నాడు.
అక్కడ తన భార్యను విగతజీవిగా పడి ఉండటం చూసి అతడు గుండె బరువెక్కింది. ఆమె వంటిపై దుస్తులు చెదిరిపోవడం, మెడలోని మాంగల్యం, చైన్, ఇతర బంగారు ఆభరణాలు కూడా లేకపోవడం అతడు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…