Woman Marries Her Nephew In Front Of Her Husband & Daughter
బీహార్‌లోని జముయ్ జిల్లాలో ఒక విపరీతమైన ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముగ్గురి జీవితాల్ని పూర్తిగా తలకిందులు చేసిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. సిఖేరియా గ్రామానికి చెందిన ఆయుషి కుమారి అనే మహిళ తన మేనళ్లుడయిన అయిన సచిన్ దూబేతో ఓ ఆలయంలో పచ్చబొట్టేసుకుంది. ఆశ్చర్యకరంగా, ఈ వివాహం ఆమె భర్త మరియు చిన్న కుమార్తె ముందే జరిగింది.
ఆయుషి మొదట 2021లో విశాల్ దూబేతో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే కొన్ని నెలలుగా ఆయుషికి, తన భర్తకు బంధువైన సచిన్ దూబేతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయం పెరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి, చివరకు భార్యగా మారే వరకు తీసుకెళ్లింది. జూన్ 15న ఆయుషి ఆకస్మికంగా గల్లంతవ్వడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ ఆ తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆయుషి విడాకులకు కోర్టులో దరఖాస్తు చేయడంతో పాటు, తన కుమార్తెను కూడా వద్దనుకుంది. రెండు కుటుంబాల అంగీకారంతో, జూన్ 20న గ్రామంలోని ఆలయంలో ఆయుషి – సచిన్ వివాహం జరిగింది. వివాహం అనంతరం సచిన్ మాట్లాడుతూ, “ఇప్పుడైనా మా ప్రేమకు గుర్తింపు వచ్చింది. ఆయుషిని జీవితాంతం సంతోషంగా ఉంచుతాను” అని అన్నాడు. మరోవైపు, భర్త విశాల్ స్పందిస్తూ, “ఆమె సంతోషంగా ఉంటే చాలు, అడ్డుకోవాలనుకోవడం లేదు. కానీ నా మీద వేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలే. ఆమె నా తల్లి, కుమార్తెతో మంచిగా ఉండేది కాదు. ఇకమీదట ఆమె బాధ్యత సచిన్‌దే” అని స్పష్టం చేశారు.
ఇప్పుడు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రేమ పేరు చెప్పుకుంటూ కుటుంబాన్ని, బంధాలను తాకట్టు పెట్టే విధానంపై పలువురు విమర్శలు చేస్తుండగా, కొందరైతే వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతుగా అభిప్రాయపడుతున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…