General News

World Cup T20 : ధోని లేకపోతే వరల్డ్ కప్ గెలవలేమా..? రోహిత్, కోహ్లీతో కాదంటూ ధోని నామస్మరణ చేస్తున్న క్రికెట్ అభిమానులు..!

World cup T20 : నిన్న జరిగిన సెమీ ఫైనల్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఇండియా ఆట తీరును చూసిన ఇండియన్ క్రికెట్ లవర్స్ కి అనిపించిన మాట మళ్ళీ ధోని లాంటోడు ఇండియన్ టీంకి కావాలి అని. ధోని తరువాత అంతటి సమర్థవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న రోహిత్ వ్యూహం రచన నిన్న మ్యాచ్ లో ఏ మాత్రం కనిపించలేదు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ల దాటికి ఒక మూలన చూస్తూ ఉండిపోయినట్లు అనిపించింది. ఓడిపోవడం బాధగా లేదు స్పోర్ట్స్ లో అవన్నీ కామన్ కానీ ఎలా ఓడిపోయామన్నదే ఇక్కడ బాధిస్తోంది అంటూ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మాటల్లో సత్యముంది. నిజానికి నిన్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ చెలరేగి ఆడింది అనడం కంటే ఇండియా చేతులెత్తిసింది అనొచ్చు.

ఇండియాకు కావాల్సింది రోహిత్ కాదు ధోని…

ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ లో పది వికెట్ల తేడాతో టీం ఇండియా ఘోరంగా విఫలమైనపుడు అక్కడున్న ఇండియా ప్రేక్షకులకు గుర్తొచ్చిన వ్యక్తి ధోని. లక్ష్యాన్ని నిర్దేశించడం కాదు ఆ లక్ష్యాన్ని కాపాడుకోవడం కూడా రావాలి. అందుకే నిన్న మ్యాచ్ ముగిసే సమయానికి అందరికీ ధోని గుర్తొచ్చాడు, ధోని… ధోని…అంటూ మైదానం లో అరిచారు. మొదటగా ఐసీసీ ట్రోఫీ ఇండియాకి ఇచ్చింది కపిల్ దేవ్ సేన ఆ తరువాత మళ్ళీ ఇండియా కప్ అందుకోడానికి టైం పట్టింది. 2007 ధోని సేన టీ20 వరల్డ్ కప్, 2011 వన్ డే వరల్డ్ కప్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా వరుసగా సాధించి పెట్టాడు. అంతే ఆ తరువాత టీం ఇండియా నాక్ అవుట్ వరకు వెళుతుంది కానీ కప్ మాత్రం కొట్టదు. 2014 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ పోరులో ఓటమి, ఇక 2016 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌ ఓటమి, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ ఇలా అన్నింటా నాక్ అవుట్ వరకు వెళ్లి వెనక్కి వస్తోంది.

కేవలం ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉండటమే కాదు అత్యుత్తమ వ్యూహరచన కూడా అవసరం, అందుకే ధోని లోటు ఇండియన్ టీంలో అందరికీ కనబడుతోంది. ఇంగ్లాండ్ గడ్డ మీద వారి మీదే 130 పరుగు లక్ష్యాన్ని కాపాడుకొని ఐసీసీ ట్రోఫీ గెలవడం ధోనికే చెల్లింది అంటారు. రోహిత్ ఐపీల్ మ్యాచల్లో అద్భుత ప్రదర్శన చూసిన అందరూ ఈసారి వరల్డ్ కప్ మనదే అనుకున్నారు. కానీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మంచి బౌలర్లు ఉన్నా సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డాడు. ఇంతవరకు టీం ఇండియా రాగాలిగారంటే కేవలం విరాట్ కోహ్లీ, అర్షదీప్, సూర్య కుమార్ యాదవ్ ల ఆట వల్లే అని చెప్పొచ్చు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago